PM Modi: రాహుల్ మాదిరిగా పార్లమెంటులో మాట్లాడొద్దు
ABN , Publish Date - Jul 02 , 2024 | 12:10 PM
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాదిరిగా పార్లమెంటులో మాట్లాడవద్దని ప్రధాని మోదీ ఎన్డీయే ఎంపీలకు సూచించారు. పార్లమెంట్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ఎన్డీయే ఎంపీలకు పలు సూచనలు చేశారు. పార్లమెంటు నియమాలు, సంప్రదాయాలను తప్పక పాటించాలని హితవు పలికారు.
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాదిరిగా పార్లమెంటులో మాట్లాడవద్దని ప్రధాని మోదీ ఎన్డీయే ఎంపీలకు సూచించారు. పార్లమెంట్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ఎన్డీయే ఎంపీలకు పలు సూచనలు చేశారు. పార్లమెంటు నియమాలు, సంప్రదాయాలను తప్పక పాటించాలని హితవు పలికారు. పార్లమెంటు అంశాలపై అవగాహాన, నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు.
ఎంపీలందరికీ దేశ సేవే ప్రథమ ప్రాధాన్యం కావాలని సూచించారు. మీకు నచ్చిన అంశాలపై ఎక్కువ సమయం కేటాయించాలని తెలిపారు. ఢిల్లీలోని ప్రధాని మోదీ సంగ్రహాలయానికి అందరూ వెళ్లాలని సూచించారు. దేశానికి విశేషమైన సేవలందించిన మాజీ ప్రధానుల నుంచి స్ఫూర్తి పొందాలని ఎన్డీయే ఎంపీల సమావేశంలో ప్రధాని మోదీ తెలిపారు. అలాగే సోమవారం లోక్ సభలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై చేసిన వాఖ్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే అంశంపై చర్చించినట్టుగా తెలుస్తోంది.