Electoral bonds: ఎలక్టోరల్ బాండ్స్‌పై ఆర్ఎస్ఎస్ స్పందనిదే..
ABN , Publish Date - Mar 17 , 2024 | 05:16 PM
రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఉద్దేశించిన ఆర్థిక సాధనమైన ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న క్రమంలో దీనిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్పందించింది. ఎలక్టోరల్ బాండ్స్‌ను ప్రయోగాకత్మకంగా తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె అన్నారు.
నాగపూర్: రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఉద్దేశించిన ఆర్థిక సాధనమైన ఎలక్టోరల్ బాండ్ల (Electoral bonds) వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న క్రమంలో దీనిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) స్పందించింది. ఎలక్టోరల్ బాండ్స్‌ను ప్రయోగాకత్మకంగా (Experment) తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె (Dattatreya Hosabale) అన్నారు.
''ఎలక్టోరల్ బాండ్స్ అనేవి అకస్మాత్తుగా ఈరోజు ప్రవేశపెట్టినవి కాదు. ఇలాంటి స్కీమ్‌లు గతంలో కూడా తెచ్చారు. ఎప్పుడైనా ఒక మార్పునకు శ్రీకారం చుట్టినప్పుడు సహజంగానే ప్రశ్నలు తలెత్తుంటాయి. ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు)లను ప్రవేశపెట్టినప్పుడు కూడా ఈ తరహా ప్రశ్నలే వచ్చాయి'' అని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ హోసబలె చెప్పారు. కొత్త సిస్టమ్ ఏ విధంగా ప్రయోజనకారిగా, సమర్ధవంతంగా ఉంటుందో అనేది కాలమే చెబుతుందని, దీనికి ఒక ఎక్స్‌పర్‌మెంట్‌గానే చూడాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోందని అన్నారు.. ఆర్ఎస్ఎస్ సర్‌కార్వవహ్ (ప్రధాన కార్యదర్శి)గా హోసబలె ఆదివారంనాడు తిరిగి ఎన్నికయ్యారు.