Home » RSS
భారతీయ జనతా పార్టీలో పది రోజుల్లో కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు పూర్తయ్యింది. మేలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు గవర్నర్ల నియామకాలపై చర్చలు జరుగుతున్నాయి
రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా పనిచేస్తున్నారని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం తీవ్రంగా విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులతో మూడుసార్లు ‘జై శ్రీరామ్’ అని పలికించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు
వక్ఫ్ సవరణ బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా పలువులు బీజేపీ నేతలు ఈ బిల్లుకు క్రైస్తవ సంఘాలు, కేరళ కేథలిక్ బిషప్ కౌన్సిల్ మద్దతు తెలిపినట్టు చెప్పారు. దేశంలో వక్ఫ్కు 39 లక్షల ఎకరాలు ఉన్నట్టు ఒక అంచనాగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలిపారు.
దేశనాయకత్వాన్ని మార్చాలని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్టు తాను నమ్ముతున్నానని, తన రిటైర్మెంట్ అప్లికేషన్ అందజేయడానికి ప్రధాన మంత్రి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లి ఉండవచ్చని సంజయ్ రౌత్ అన్నారు.
ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ను ‘భారతీయ సంస్కృతి వటవృక్షం’గా కొనియాడారు. కాంగ్రెస్ విధానాల వల్ల నక్సలిజం వ్యాప్తి చెందిందని ఆయన ఆరోపించారు
దేశనిర్మాణం, సమాజ సేవ, సంస్కృతీ పరిరక్షణలో ఆర్ఎస్ఎస్ వలంటీర్లు విశిష్ట సేవలందిస్తున్నారని మోదీ అన్నారు. నాగపూర్లోని మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్కు ప్రధాని ఆదివారంనాడు శంకుస్థాపన చేశారు.
పార్టీల సిద్ధాంతాలు, విధానాల విషయంలో 'ఇండియా' కూటమి భాగస్వామ పార్టీల మధ్య సల్ప తేడాలు ఉండవచ్చనీ, కానీ దేశ విద్యా వ్యవస్థ విషయంలో ఎప్పుడూ రాజీపడలేదని రాహుల్ గాంధీ అన్నారు.
ముస్లింలకు 2B కేటగిరి కింద 4 శాతx రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలపడంపై అడిగిన ఒక ప్రశ్నకు దత్తాత్రేయ హోసబలె సమాధానమిస్తూ, ఇదే తరహా ప్రయత్నాలు గతంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో జరిగినప్పటికీ సంబంధించి హైకోర్టులు కొట్టేశాయని చెప్పారు.
సంఘ్ కింద 32 సంస్థలు పనిచేస్తున్నాయనీ, ప్రతి ఆర్గనైజేషన్ స్వతంత్రంగా పని చేస్తుందని, సొంతగానే నిర్ణయాలు తీసుకుంటారని అరుణ్ కుమార్ చెప్పారు. ప్రతి సంస్థకు సొంత సభ్యులు, ఎన్నికలు, స్థానిక-జిల్లా-మండల స్థాయిలో సొంత వ్యవస్థ ఉంటుందన్నారు.
నాగపూర్ హింస, ఔరంగబేజు సమాధి వ్యవహారంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ రకమైన హింస సమాజానికి మంచిది కాదని ఆర్ఎస్ఎస్ కీలక నేత సునీల్ అంబేకర్ అన్నారు.