Elon Musk: ట్రంప్‌కు భారీ విరాళం..
ABN , Publish Date - Jul 13 , 2024 | 03:53 PM
టెస్లా అధినేత, ఎక్స్ చైర్ పర్సన్ ఎలాన్ మాస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు భారీ విరాళం అందజేశారు. రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ మొత్తంలో నగదు అందజేశారని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. నేరుగా ట్రంప్‌కి కాకుండా అమెరికా పీఏసీ (పొలిటికల్ యాక్షన్ కమిటీ)కి డొనేట్ చేశారు.
టెస్లా అధినేత, ఎక్స్ చైర్ పర్సన్ ఎలాన్ మాస్క్ (Elon Musk) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు భారీ విరాళం అందజేశారు. రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ మొత్తంలో నగదు అందజేశారని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. నేరుగా ట్రంప్‌కి కాకుండా అమెరికా పీఏసీ (పొలిటికల్ యాక్షన్ కమిటీ)కి డొనేట్ చేశారు. ఈ కమిటీ ట్రంప్ తరఫున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నగదు అందజేసిన సంస్థలు/ వ్యక్తుల పేర్లను 15వ తేదీన (సోమవారం) పీఏసీ వెల్లడించనుంది.
విరాళాల వెల్లువ
అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య బిగ్ డిబేట్‌లో బైడెన్‌పై ట్రంప్ పైచేయి సాధించారు. దాంతో ట్రంప్ ప్రచారానికి కార్పొరేట్ విరాళాలు భారీగా వస్తున్నాయి. ఆ క్రమంలో ఎలాన్ మాస్క్ విరాళం అందజేశారు. మరో విశేషం ఏమిటంటే.. ఎలాన్ మాస్క్ సౌతాఫ్రికాకు చెందిన వలసదారుడు. అమెరికాలో స్థిరపడ్డ సంగతి తెలిసిందే. వలసదారులపై కఠిన ఆంక్షలు విధించే ట్రంప్ కోసం విరాళం అందజేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రంప్‌కు మాస్క్ విరాళం అందజేశారు. అయినప్పటికీ ట్రంప్, లేదంటే బైడెన్‌కు మద్దతు ఇస్తానని బహిరంగంగా మాత్రం ప్రకటించలేదు.
Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!
బైడెన్ అంటే పడదు..
ఎలాన్ మాస్క్ డెమోకాట్రపై విమర్శలు చేసేవారు. జో బైడెన్ అంటే మండి పడేవారు. దీనిని బట్టి పరోక్షంగా ట్రంప్‌కు సపోర్ట్ చేస్తున్నారని అర్థమవుతోంది. గతంలో ట్రంప్ ఎక్స్ అకౌంట్‌ను ట్విట్టర్ బ్యాన్ చేసింది. ట్రంప్ ట్విట్టర్ కొనుగోలు చేసిన వెంటనే ఖాతాను పునరుద్ధరించారు. ఈ రెండు కారణాలతో మస్క్.. ట్రంప్‌ను బలపరుస్తున్నారని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి:
Read Latest International News and Telugu News