Share News

BSF: పుల్వామాలో మళ్లీ పేలిన తూటా.. బీఎస్ఎఫ్, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు

ABN , Publish Date - Jun 03 , 2024 | 09:32 AM

సరిహద్దులో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. భారత భద్రతా బలగాలే(BSF) టార్గెట్‌గా విరుచుకుపడుతున్నారు. సోమవారం ఉదయం జమ్మూకశ్మీర్‌లో(Jammu Kashmir) ఉగ్రవాదులు(Terrorists), భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.

BSF: పుల్వామాలో మళ్లీ పేలిన తూటా.. బీఎస్ఎఫ్, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు

ఢిల్లీ/శ్రీనగర్: సరిహద్దులో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. భారత భద్రతా బలగాలే(BSF) టార్గెట్‌గా విరుచుకుపడుతున్నారు. సోమవారం ఉదయం జమ్మూకశ్మీర్‌లో(Jammu Kashmir) ఉగ్రవాదులు(Terrorists), భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.

పుల్వామా జిల్లాలోని నిహామా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందడంతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి.


"పుల్వామా జిల్లా నిహామా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. పోలీసులు, భద్రతా బలగాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది" అని కశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్‌లో పేర్కొన్నారు. సెర్చ్ ఆపరేషన్‌లో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.

For Latest News and National News click here

Updated Date - Jun 03 , 2024 | 09:32 AM