Share News

Fake Garlic Video: వీళ్లకు కుంభీపాకమే.. మార్కెట్లోకి ఫేక్ వెల్లుల్లి తస్మాత్ జాగ్రత్త

ABN , Publish Date - Aug 19 , 2024 | 07:35 AM

ఫేక్ వెల్లుల్లి తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన విశ్రాంత పోలీస్ ఆఫీసర్ సుభాష్ పాటిల్ ఇలాంటి నకిలీ వెల్లుల్లి రాకెట్‌ గుట్టు రట్టు చేశారు. తాను నకిలీ వెల్లుల్లి వల్ల మోసపోయినట్లు వీడియో రిలీజ్ చేశారు.

Fake Garlic Video: వీళ్లకు కుంభీపాకమే.. మార్కెట్లోకి ఫేక్ వెల్లుల్లి తస్మాత్ జాగ్రత్త

ఇంటర్నెట్ డెస్క్: అపరిచితుడు సినిమా గుర్తుందా. అందులో గరుడపురాణం పుస్తకంలో భూలోకంలో చేసే తప్పులకు నరకలోకంలో ఎటువంటి శిక్షలు విధిస్తారు.. ఆ శిక్షలు ఎలా ఉంటాయి అని చూపించారు. నిజంగా అవి ఉన్నాయో లేదు తెలియదు కాని, ఆ సినిమా చూసినతరువాత ప్రతి ఒక్కరు తప్పులు చేయాలంటే భయపడ్డారు. ఆహారాన్ని కల్తీ చేసే వారికి కూడా ఓ శిక్ష ఉందండోయ్. అదే కుంభిపాకం. నిజంగా నరకలోకం అనేది ఉంటే.. కలియుగంలో కల్తీ జరుపుతున్న దుర్మార్గులకు సరైన శిక్ష పడుతుంది. అదీ.. ఇదీ అని ఏదీ లేదు. సర్వం కల్తీమయం. ఇది ప్రస్తుత సమాజం. కల్తీ చేస్తూ మనిషి ఆయుర్దాయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నారు కేటుగాళ్లు.ఇప్పటికే నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాలు మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. వాటి తయారీ కోసం వాడిన అల్లం వెల్లుల్లిని, ప్రదేశాన్ని చూస్తే జీవితంలో వాటి జోలికి వెళ్లరు. ఇప్పుడు ఏకంగా ఫేక్ వెల్లుల్లి తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు.


గుట్టురట్టయింది ఇలా..
మహారాష్ట్రకు చెందిన విశ్రాంత పోలీస్ ఆఫీసర్ సుభాష్ పాటిల్ ఇలాంటి నకిలీ వెల్లుల్లి రాకెట్‌ గుట్టు రట్టు చేశారు. తాను నకిలీ వెల్లుల్లి వల్ల మోసపోయినట్లు వీడియో రిలీజ్ చేశారు. అకోలాలోని బజోరీయా నగర్ లో సుభాష్ పాటిల్ అనే విశ్రాంత పోలీస్ అధికారి నివసిస్తున్నారు. ఒకరోజు తన ఇంటిముందుకు వచ్చిన వ్యాపారి వద్ద అతని భార్య వెల్లుల్లి కొనుగోలు చేసింది. ఆమె ఇంట్లోకి వచ్చి పొట్టు తీద్దామని ప్రయత్నించగా.. అవి చాలా గట్టిగా అనిపించాయి. ఎంతకూ విరగకపోవడంతో కత్తి తీసుకొని వాటిని కోయడం ప్రారంభించింది. అయినా వెల్లుల్లి అలాగే ఉంది. వాటిని తీక్షణంగా పరీక్షిస్తే అవి ఫేకని తేలింది.


వాటిని సిమెంట్‌తో తయారు చేసి పైన కలర్ పూశారని తెలిసి ఆమె నిర్ఘాంతపోయింది. మోసపోయామని గుర్తించి విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. వారిద్దరు ఫేక్ వెల్లుల్లి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో కనిపిస్తున్న వెల్లిగడ్డను చూస్తే మామూలుగానే ఉంది. అయితే పొర తీసి చూడగా లోపలి భాగమంతా సిమెంట్‌ ఉంది. వీడియోను చూసిన నెటిజన్లు సైతం ఖిన్నులవుతున్నారు. వెల్లిగడ్డ పై పొర మాత్రమే అలాగే ఉంచి లోపలంతా సిమెంట్‌ను నింపి మార్కెట్లోకి వదులుతూ మోసానికి పాల్పడుతున్నారని గుర్తించారు. వెల్లుల్లి ధరలు ఎక్కువగా ఉండటంతో, ఫేక్ వెల్లుల్లి అమ్మి సొమ్ము చేసుకోవడానికి దుర్మార్గులు ఇలాంటి అక్రమాలకు తెరతీశారని నెటిజన్లు అంటున్నారు. ఇకపై వెల్లుల్లి కొనాలన్న పరిశీలించాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వారికి గరుడపురాణంలోని శిక్షలే కరెక్ట్‌ అని చెబుతున్నారు.

For Latest News and National News click here

Updated Date - Aug 19 , 2024 | 08:22 AM