Share News

Bihar: బిహార్‌లో ఘోర అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:02 AM

బిహార్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం పట్నా రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో జరిగింది.

Bihar: బిహార్‌లో ఘోర అగ్ని ప్రమాదం

ఆరుగురి సజీవదహనం.. 30 మందికి గాయాలు

బిహార్‌, ఏప్రిల్‌ 25: బిహార్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం పట్నా రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, వారిలో ఏడుగురి పరిస్థితి విషయంగా ఉందని పోలీసులు తెలిపారు.]


‘‘ఉదయం 11 గంటల సమయంలో హోటల్‌లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో భవనం చుట్టూ దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందడంతో హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాం. క్షతగాత్రులను రక్షించాం. గ్యాస్‌ సిలిండర్‌ పేలడమే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నాం. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. క్షతగాత్రులలో ఏడుగురి పరిస్థితి విషయంగా ఉంది.’’ అని పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 26 , 2024 | 06:08 AM