Share News

Vaishno Devi Ropeway Project: పోలీసులతో స్థానికుల ఘర్షణ, రాళ్లు రువ్వడంతో పలువురికి గాయాలు

ABN , Publish Date - Nov 25 , 2024 | 06:10 PM

తారాకోతో మార్గ్ నుంచి సాంజి ఛత్ మధ్య రూ.250 కోట్లతో రోప్‌వే ప్రాజెక్టుకు శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ రోప్‌వేతో ప్రయాణ సమయం ఆదా కావడంతో పాటు, యాత్రికులకు, ముఖ్యంగా వృద్ధులకు ప్రయోజనం చేకూరుతుందని ఆలయ బోర్డు చెబుతోంది.

Vaishno Devi Ropeway Project: పోలీసులతో స్థానికుల ఘర్షణ, రాళ్లు రువ్వడంతో పలువురికి గాయాలు

జమ్మూ: ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయానికి (Vaishno Devi Shrine) ట్రెక్ మార్గంలో ఆలయ బోర్డు ప్రతిపాదించిన రోప్‌వే ప్రాజెక్టు (Ropeway project) స్థానికుల్లో అలజడి రేపుతోంది. ఇందువల్ల ఉపాధి కోల్పోతామని ఆందోళన చెందుతున్న స్థానిక దుకాణదారులు, పోనీ సర్వీస్ ప్రొవైడర్లు, కార్మికులు జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లా కత్రా బేస్ బేస్ క్యాంపు వద్ద పోలీసులతో సోమవారంనాడు ఘర్షణకు దిగారు. దీంతో ఉద్రికత నెలకొంది. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు.

Supreme Court: రాజ్యాంగ పీఠిక అంశంపై సుప్రీం కీలక తీర్పు


తారాకోతో మార్గ్ నుంచి సాంజి ఛత్ మధ్య రూ.250 కోట్లతో రోప్‌వే ప్రాజెక్టుకు శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ రోప్‌వేతో ప్రయాణ సమయం ఆదా కావడంతో పాటు, యాత్రికులకు, ముఖ్యంగా వృద్ధులకు ప్రయోజనం చేకూరుతుందని ఆలయ బోర్డు చెబుతోంది. అయితే, ఈ ప్రాజెక్టు వల్ల తమ జీవనోపాధి పోతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సాంప్రదాయక మార్గాన్ని బైపాస్ చేస్తూ ఈ ప్రాజెక్టు ఉండటం వల్ల తాము రోడ్లపై పడతామని అంటున్నారు. ఇందుకు నిరసనగా వందలాది మంది దుకాణదారులు, పోర్టర్లు, పోనీ సర్వీస్ ప్రొవైడర్లు బైఠాయింపు నిరసనలు జరుపుతున్నారు. 'భారత్ మాతా కీ జై' నినాదాలు హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారంనాడు ఆ ప్రాంతం గుండా సీఆర్‌పీఎఫ్ వాహనం వెళ్తుండగా నిరసనకారులు అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో వాహనం అద్దం పగలడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనిపై రియాసి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిస్థతి సవాలుగా నిలవడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సమస్య పరిష్కారానికి నిరసనకారులతో అధికారులు మంతనాలు సాగిస్తు్న్నట్టు తెలిపారు.


కాగా, ప్రతిపాదిత ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని, దాని వల్ల ప్రభావితమయ్యే కుటుంబాలకు సరైన పరిహారం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22న నిరసనకారులు 72 గంటల సమ్మెకు పిలుపునిచ్చారు. అనంతరం మరో రోజు నిరసన కార్యక్రమాన్ని పొడిగించారు. కత్రాలో రోప్‌వే ప్రాజెక్టును తాము అనుమతించేది లేదని, మూడేళ్లుగా దీనికి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నామని, గతంలో తమకు ఇచ్చిన హామీలను విస్మరించి ఇప్పుడు రోప్‌వే ప్రాజెక్టుతో ఆలయ బోర్డు ముందుకు వెళ్తోందని షాప్‌కీపర్స్ అసోసియేషన్ నేత ప్రభాత్ సింగ్ తెలిపారు.


Sambhal Violence: మసీదు సర్వే నేపథ్యంలో ఘర్షణ.. 20 మంది అరెస్ట్, స్కూల్స్, ఇంటర్నెట్ బంద్

Rahul: యూపీలోని సంభాల్ కాల్పుల ఘటనపై రాహుల్ ఏమన్నారంటే..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 25 , 2024 | 06:10 PM