Fenugreek effect: ప్రజలకు కోపం వస్తే ఇలాగే ఉంటది మరి.. మంత్రిపై బురద చల్లిన ‘వరద’ బాధితులు..
ABN , Publish Date - Dec 04 , 2024 | 10:34 AM
తమకు సాయం అందలేదన్న కోపంతో బాధితులు రాష్ట్ర మంత్రిపైనే బురదచల్లడం ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాలిలా వున్నాయి... ఫెంగల్ తుఫాను ప్రభావంతో విల్లుపురం జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే.
- సాయం అందలేదన్న కోపంతో చల్లిన జనం
హైదరాబాద్: విల్లుపురం జిల్లా ఇరువేల్‌పట్టు ప్రాంతంలో తగిన సాయం అందలేదన్న కోపంతో బాధితులు రాష్ట్ర మంత్రిపైనే బురదచల్లడం ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాలిలా వున్నాయి... ఫెంగల్ తుఫాను ప్రభావంతో విల్లుపురం జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. దిండివనం(Dindivanam) సమీపం మయిల్ ప్రాంతంలో అత్యధికంగా 51 సెం.మీ వర్షపాతం నమోదుకావడం, సమీపంలోని చెరువు గట్లు తెగడంతో దిండివనం కూడా జలమయమైంది.
ఈ వార్తను కూడా చదవండి: ఐఎండీ అలర్ట్.. వచ్చే 24 గంటల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
వరద బాధిత ప్రాంతాల్లో సైనికులు సహాయక చర్యలు చేపట్టి, బాధితులను విల్లుపురం పునరావాస శిబిరాలకు తరలించారు. ఈ నేపథ్యంలో, మంగళవారం వరద బాధిత ప్రాంతాలు పరిశీలించి బాధితులకు సహాయాలందించేందుకు మంత్రి పొన్ముడి(Minister Ponmudi), జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులు విల్లుపురం చేరుకున్నారు. ఇరువేల్‌పట్టు ప్రాంతంలో ప్రజలు ఆందోళన చేపడుతున్నారని తెలుసుకున్న మంత్రి వారితో మాట్లాడేందుకు వెళ్లారు.
అయితే మంత్రి పర్యటనను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ప్రభుత్వం నుంచి తమకెలాంటి సాయం అందలేదని, శిబిరంలో ఆహారం కూడా అందించడం లేదని నినాదాలు చేపట్టారు. అయితే ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మంత్రిపై బురద చల్లారు. అక్కడున్న పోలీసులు మంత్రి చుట్టూ నిలిచారు. నిరసనకారుల ఆగ్రహాన్ని గ్రహించిన మంత్రి పొన్ముడి.. అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయారు.
ఈవార్తను కూడా చదవండి: రెండు రోజులుగా జలదిగ్భంధంలోనే సిరికొండ...
ఈవార్తను కూడా చదవండి: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..
ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..
ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్
Read Latest Telangana News and National News