Share News

Vikram Misri: హిందువులపై దాడులు.. బంగ్లాదేశ్ చేరుకున్న విదేశాంగ కార్యదర్శి

ABN , Publish Date - Dec 09 , 2024 | 01:34 PM

బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వంపై ప్రజాగ్రాహం వెల్లువెత్తింది. దీంతో ఆమె తన ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొంది. పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆమె భారత్ లో తలదాచుకున్నారు. ఇక బంగ్లాదేశ్ లో మహ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం కొలువు తీరింది.

Vikram Misri: హిందువులపై దాడులు.. బంగ్లాదేశ్ చేరుకున్న విదేశాంగ కార్యదర్శి

ఢాకా, డిసెంబర్ 09: బంగ్లాదేశ్‍లో హిందువులపై దాడులు రోజు రోజుకు పెరుగుతోన్నాయి. దీనిపై సర్వత్ర ఆందోళనలు వ్యక్తమవుతోన్నాయి. దీంతో పొరుగునున్న భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరహా చర్యలను నియంత్రించేందుకు బంగ్లాదేశ్‍తో చర్చించాలని భారత్ నిర్ణయించింది. అందులోభాగంగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం ఉదయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకున్నారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో విక్రమ్ మిస్రీకి ఆ దేశ అత్యున్నత అధికార యాంత్రాంగం ఘనంగా స్వాగతం పలికింది. ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ దేశాల మధ్య ఏర్పాటు చేసిన ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్ (ఎఫ్ఓసీ)లో పాల్గొనుంది. ఈ సందర్బంగా భారత్, బంగ్లాదేశ్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారని తెలుస్తుంది. ఆ క్రమంలో పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నట్లు సమాచారం.

Also Read: కొనసాగుతోన్న వాయిదాల పర్వం.. మూడు కీలక బిల్లుల ఆమోదం!


మరోవైపు బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై హింస పెరిగిపోయిందంటూ వార్తా కథనాలు వెల్లువెత్తుతోన్నాయి. డిసెంబర్ 6వ తేదీన రాజధాని ఢాకా నగర శివార్లలో హిందూ దేవాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. అలాగే ఢాకా నగర ఉత్తర ప్రాంతంలోని ధోర్ గ్రామంలోని మహా భాగ్యలక్ష్మీ నారాయణ మందిరంపై సైతం దాడి జరిగింది. ఈ వరుస దాడి ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు అందుతోన్నాయి.

Also Read: పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు.. కలకలం


ఇంకోవైపు నవంబర్ 25వ తేదీన చిట్టగాంగ్‌లో ఆధ్యాత్మిక గురువు చిన్మోయ్ కృష్ణ దాస్ ను దేశ ద్రోహ ఆరోపణలపై ఢాకాలో పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 31న హిందు సమాజం నిర్వహించిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను చిన్మోయ్ దాస్ తో పాటు ఇతరులు అగౌరవపరిచారంటూ స్థానిక రాజకీయ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చిన్మోయ్ కృష్ణదాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: ఆ కీలక మలుపు లేకుంటే.. జూన్ 2 గెలుపు లేనే లేదు


ఈ ఏడాది సెప్టెంబర్‌లో.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగ సలహాదారు (మంత్రి) ఎండీ తౌహిద్ హుస్సేన్ న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఇదే సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరు సమావేశమయ్యారు. భారత్, బంగ్లాదేశ్ ల మధ్య ఎఫ్ఓసీ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ క్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సోమవారం ఢాకా చేరుకున్నారు. బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మొదటి ఉన్నత స్థాయి అధికారిక పర్యటన కావడం గమనార్హం.

Also Read: Cauliflower: క్యాలీఫ్లవర్ తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?


బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వంపై ప్రజాగ్రాహం వెల్లువెత్తింది. దీంతో ఆమె తన ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొంది. పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆమె భారత్ లో తలదాచుకున్నారు. ఇక బంగ్లాదేశ్ లో మహ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం ఆ దేశంలో హిందువులు, దేవాలయాలపై దాడులు పెరుగుతోన్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

For National News And Telugu News

Updated Date - Dec 09 , 2024 | 01:35 PM