Ayodhya rape case: ఎస్పీ నేత, డింపుల్ యాదవ్ మాజీ సహచరుడి అరెస్టు
ABN , Publish Date - Aug 12 , 2024 | 03:21 PM
అయోధ్యలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో కీలక నిందితుడు, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మాజీ ప్రతినిధి నవాబ్ సింగ్ యూదవ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు కన్నౌజ్‌లో సోమవారంనాడు అరెస్టు చేశారు. అఖిలేష్ యాదవ్‌కు కూడా నవాబ్ సన్నిహితుడని తెలుస్తోంది.
లక్నో: అయోధ్యలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో (ayodhy rape case) కీలక నిందితుడు, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మాజీ ప్రతినిధి నవాబ్ సింగ్ యూదవ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు కన్నౌజ్‌లో సోమవారంనాడు అరెస్టు చేశారు. అఖిలేష్ యాదవ్‌కు కూడా నవాబ్ సన్నిహితుడని తెలుస్తోంది. ఇటీవల అఖిలేష్ యాదవ్ బర్త్‌డే సందర్భంగా ఆయనను అభినందిస్తున్న వీడియోను నవాబ్ షేర్ చేశారు. అఖిలేష్‌తో ఉన్న మరికొన్ని ఫోటోలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి.
మీడియా కథనాల ప్రకారం, ఉద్యోగం ఇస్తానని ఆశ చూపించి మైనర్ బాలికను, ఆమె అత్తను తన ఇంటికి నవాబ్ పిలిపించాడు. బాలిక తనను కలుసుకునేందుకు వచ్చినప్పుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అయితే ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా నవాబ్ కొట్టివేశారు. తన రాజకీయ కెరీర్‌ను దెబ్బకొట్టేందుకే ఇలాంటి ఆరోపణలు చేసినట్టు తెలిపారు.
Puja Khedkar: పూజా కేడ్కర్‌కు ఊరట.. తక్షణ కస్టడీ అవసరం లేదన్న హైకోర్టు
కాగా, ఇదే కేసులో రెండు నెలలుగా బాలికపై అత్యాచారం జరుపుతున్న ఆరోపణలపై మరో ఎస్పీ నేత మొయిద్ ఖాన్‌ను కూడా పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అయోధ్యలో బాధితురాలి కుటుంబాన్ని ముగ్గురు సభ్యుల బీజేపీ ప్రతినిధి బృందం ఇటీవల పరామర్శించడంతో ఈ కేసు రాజకీయరంగు పులుముకుంది. బాధితురాలి కుటుంబానికి రూ.5 నుంచి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రతినిధుల బృందం కోరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మొయిద్ ఖాన్ సమాజ్‌వాదీ పార్టీ నేత అని, ఫైజాబాద్ ఎంపీ అవదేశ్ ప్రసాద్ టీమ్‌లో ఉన్నాడని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు.
Read More National News and Latest Telugu News