Share News

Former CM: డీఎంకే పాలనలో 40 శాతం పెరిగిన ధరలు.. క్షీణించిన శాంతిభద్రతలు

ABN , Publish Date - Jan 27 , 2024 | 12:47 PM

డీఎంకే పాలనలో నిత్యావసర సరుకుల ధరలు 40 శాతం పెరిగాయని, అదే సమయంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) విమర్శించారు.

Former CM: డీఎంకే పాలనలో 40 శాతం పెరిగిన ధరలు.. క్షీణించిన శాంతిభద్రతలు

- అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి

పెరంబూర్‌(చెన్నై): డీఎంకే పాలనలో నిత్యావసర సరుకుల ధరలు 40 శాతం పెరిగాయని, అదే సమయంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) విమర్శించారు. సేలం ముల్లమప్పంపట్టిలో శుక్రవారం డీఎంకే, పీఎంకే, డీఎండీకే సహా పలు పార్టీలకు చెందిన సుమారు 1,000 మంది ఈపీఎస్‌ సమక్షంలో అన్నాడీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్నాడీఎంకే 30 ఏళ్ల పాలనలో ఉన్నత విద్యలో తమిళనాడు దేశంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ప్రజలు, కార్యకర్తల కన్నా డీఎంకే నేతలకు వారసత్వ రాజకీయాలు కావాలన్నారు. కరుణానిధి సభలో స్టాలిన్‌, స్టాలిన్‌ సభలో ఉదయనిధి, తాజాగా సేలంలో ఉదయనిధి సభలో ఆయన కుమారుడు ఇన్బనిది పాల్గొన్నారని, వారసత్వ రాజకీయాలకు ఇదొక ఉదాహరణ అని ఎద్దేవా చేశారు. డీఎంకే రెండు సంవత్సరాల 8 నెలల కాలంలో కొత్త పథకాలు చేపట్టలేదని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పళనిస్వామి అన్నారు.

Updated Date - Jan 27 , 2024 | 12:47 PM