Jharkhand: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం
ABN , Publish Date - Oct 06 , 2024 | 04:41 PM
ఆసుపత్రిలో చేరిన కారణంగా 'మాంఝి పరగణ మహాసమ్మేళన్'కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో చంపయి సోరెన్ చెప్పారు.
జంషెడ్‌పూర్: జార్ఖాండ్ (Jharkhand) మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ (Chapai Soren) ఆస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. రక్తంలో చక్కరె స్థాయిలు తగ్గడంతో (Blood Sugar) జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్ హాస్పిటల్‌లో ఆయనను చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని ఆసుపత్రి జీఎం డాక్టర్ సుధీర్ రాయ్ తెలిపారు. కాగా, ఆసుపత్రిలో చేరిన కారణంగా 'మాంఝి పరగణ మహాసమ్మేళన్'కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో చంపయి సోరెన్ చెప్పారు.
Rahul Gandhi: 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలి: రాహుల్
జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్‌ను మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేయడంతో గత ఫిబ్రవరి 2న జార్ఖాండ్ ముఖ్యమంత్రిగా చంపయి సోరెన్ పగ్గాలు చేపట్టారు. ఐదు నెలల తర్వాత జూలైలో హేమంత్ సోరెన్ బెయిలుపై విడుదల కావడంతో సీఎం పదవికి చంపయి సోరెన్ రాజీనామా చేశారు. దీంతో తిరిగి హేమంత్ సోరెన్ సీఎం అయ్యారు. ఈ పరిణామలతో అసంతృప్తి చెందిన చంపయి సోరెన్ గత ఆగస్టు 30న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అసోం సీఎం హిమంత బిస్వా శర్మ, జార్ఖాండ్ బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ సమక్షంలో బీజేపీలో చేరారు. 67 గిరిజన నేత అయిన చంపయి సోరెన్ 'జార్ఖాండ్ టైగర్'గా పేరుంది. 1990లో జార్ఖాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన పోరాటం చేశారు. 2000లో బీహార్ నుంచి జార్ఖాండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. 1991లో అవిభక్త బీహార్‌లోని సరాయికేల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత జేఎంఎం టిక్కెట్టుపై 2000, 2005, 2009, 2014, 2019లో వరుసగా గెలుపొందారు.