Share News

National : మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మృతి

ABN , Publish Date - May 28 , 2024 | 04:49 AM

ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, పూర్వపు ముదినేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, విజయ డెయిరీ డైరెక్టర్‌ యెర్నేని సీతాదేవి(74) హైదరాబాద్‌లోని తన కుమార్తె హంసిని ఇంటిలో సోమవారం వేకు వ జామున గుండెపోటుతో కన్నుమూశారు.

National : మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మృతి

చంద్రబాబు, కామినేని సంతాపం

కలిదిండి, మియాపూర్‌, మే 27: ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, పూర్వపు ముదినేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, విజయ డెయిరీ డైరెక్టర్‌ యెర్నేని సీతాదేవి(74) హైదరాబాద్‌లోని తన కుమార్తె హంసిని ఇంటిలో సోమవారం వేకు వ జామున గుండెపోటుతో కన్నుమూశారు.

ముదినేపల్లి నియోజకవర్గం నుంచి రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. ఆమె భర్త, రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షు డు యెర్నేని నాగేంద్రనాథ్‌ 2023లో అనారోగ్యంతో మృతి చెందారు.

వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆమె పార్థివ దేహం సోమవారం రాత్రికి స్వగ్రామం కొండూరు చేరనుంది. బుధవారం అంత్యక్రియలు జరపనున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఓ ప్రకటనలో సంతాపం ప్రకటిస్తూ... ‘ఎమ్మెల్యేగా, విద్యాశాఖ మంత్రిగా తనదైన ముద్ర వేశారు. సీతాదేవి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’ అని పేర్కొన్నారు.

Updated Date - May 28 , 2024 | 04:55 AM