Share News

NHRC: ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్మన్‌గా కొత్త చైర్మన్‌గా వి.రామసుబ్రమణ్యం

ABN , Publish Date - Dec 23 , 2024 | 07:27 PM

ఎన్‌హెచ్‌ఆర్‌సీ కొత్త చైర్మన్‌గా నియమితులైన జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం మద్రాసు లా కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశారు. 1983 ఫిబ్రవరి 16న బార్ మెంబర్‌గా పేరు నమోదు చేసుకున్నారు.

NHRC: ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్మన్‌గా కొత్త చైర్మన్‌గా వి.రామసుబ్రమణ్యం

న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.రామసుబ్రమణ్యం (V.Ramasubramaniam) నియమితులయ్యారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారంనాడు ఆదేశాలు జారీ చేశారు. ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్మన్‌గా పనిచేసిన జస్టిస్ అరుణ్ మిశ్రా గత జూన్ 1 రిటైరయ్యారు. దీంతో ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యురాలు విజయభారతి సయాని తాత్కాలిక చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తూ వచ్చారు.

Puja Khedkar: మాజీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్‌కు దక్కని ఉపశమనం


ఎన్‌హెచ్‌ఆర్‌సీ కొత్త చైర్మన్‌గా నియమితులైన జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం మద్రాసు లా కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశారు. 1983 ఫిబ్రవరి 16న బార్ మెంబర్‌గా పేరు నమోదు చేసుకున్నారు. మద్రాసు హైకోర్టులో 23 ఏళ్లు లాయర్‌గా ప్రాక్టీసు చేశారు. 2006 జూలై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2009 నవంబర్ 9న శాశ్వత జడ్జిగా బాధ్యతలు నిర్వహించారు. తన సొంత రిక్వెస్ట్‌ మీద 2016 ఏప్రిల్ 27న హైదరాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. రెండు రాష్ట్రాల విభజన తర్వాత 2019 జనవరి 1 నుంచి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగారు. 2019 జూన్ 22 నుంచి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌‌గా ఉన్నారు. 2019 సెప్టెబర్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 జూన్ 29న ఆయన పదవీ విరమణ చేశారు.


కాగా, ఎన్‌హెచ్ఆర్‌సీ కొత్త సభ్యులుగా ప్రియాంక్ కనూంగో, డాక్టర్ బిద్యుత్ రంజన్ సారంగి (రైటైర్డ్)ని కూడా నియమిస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు.


ఇది కూడా చదవండి..

Karti Chidambaram: వారానికి 4 రోజుల పని చాలు.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తితో విభేదించిన ఎంపీ

National : యూపీలో భారీ ఎన్‌కౌంటర్.. హతమైన ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు..

National Farmers Day: నేడు జాతీయ రైతు దినోత్సవం.. దీని చరిత్ర గురించి తెలుసా..

For National News And Telugu News

Updated Date - Dec 23 , 2024 | 07:27 PM