Share News

వచ్చే ఏడాదిలో 4 గ్రహణాలు

ABN , Publish Date - Dec 28 , 2024 | 06:13 AM

వచ్చే సంవత్సరంలో నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయని, వీటిలో రెండు సూర్య, రెండు చంద్రగ్రహణాలు ఉంటాయని మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ జీవాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్ర ప్రకాష్‌ గుప్తా శుక్రవారం తెలిపారు.

వచ్చే ఏడాదిలో 4 గ్రహణాలు

  • వీటిలో 2 సూర్య, 2 చంద్ర గ్రహణాలు

  • భారత్‌లో కనిపించనున్న ఒక చంద్రగ్రహణం

ఇండోర్‌, డిసెంబరు 27: వచ్చే సంవత్సరంలో నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయని, వీటిలో రెండు సూర్య, రెండు చంద్రగ్రహణాలు ఉంటాయని మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ జీవాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్ర ప్రకాష్‌ గుప్తా శుక్రవారం తెలిపారు. అయితే వీటిలో ఒక్కదానిని మాత్రమే భారత్‌లో ఖగోళశాస్త్ర ప్రేమికులు చూసే అవకాశం దక్కనుందన్నారు. 2025 మార్చి 14న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుందని, అయితే ఇది భారత్‌లో పగటిపూట సంభవించనుండటం వల్ల ఇది కనిపించే అవకాశంలేదని తెలిపారు.


అమెరికా, పశ్చిమ యూర ప్‌, పశ్చిమాఫ్రికా, ఉత్తర, దక్షిణ అట్లాంటిక్‌ మహాసముద్రాల ప్రాంతాల్లో ఇది కనిపిస్తుందన్నారు. మార్చి 29న పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుందని, ఇది కూడా భారత్‌లో కనిపించదని తెలిపారు. ఇక సెప్టెంబరు 7-8 మధ్య ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహ ణం భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశాలు, యూరప్‌, అంటార్కిటికా, పశ్చిమ పసిఫిక్‌ మహాసముద్రం, ఆస్ర్టేలియా, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుందని గుప్తా తెలిపారు. ఇక 2025 సంవత్సరంలో చివరిగా సెప్టెంబరు 21-22 మధ్య పాక్షిక సూర్య గ్రహణం సంభవిస్తుందని, ఇది భారత్‌లో కనిపించదని తెలిపారు. అమెరికా, పశ్చిమ యూర ప్‌, పశ్చిమాఫ్రికా, ఉత్తర, దక్షిణ అట్లాంటిక్‌ మహాసముద్రాల ప్రాంతాల్లో ఇది కనిపిస్తుందన్నారు. మార్చి 29న పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుందని, ఇది కూడా భారత్‌లో కనిపించదని తెలిపారు. ఇక సెప్టెంబరు 7-8 మధ్య ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహ ణం భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశాలు, యూరప్‌, అంటార్కిటికా, పశ్చిమ పసిఫిక్‌ మహాసముద్రం, ఆస్ర్టేలియా, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుందని గుప్తా తెలిపారు. ఇక 2025 సంవత్సరంలో చివరిగా సెప్టెంబరు 21-22 మధ్య పాక్షిక సూర్య గ్రహణం సంభవిస్తుందని, ఇది భారత్‌లో కనిపించదని తెలిపారు.

Updated Date - Dec 28 , 2024 | 06:13 AM