Share News

Aadhaar card update: ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.. ఉడాయ్ కీలక ప్రకటన..

ABN , Publish Date - Dec 14 , 2024 | 05:26 PM

Free Aadhaar Card Update: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్(Aadhaar) నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఆధార్‌ కార్డు ఉచిత అప్‌డేషన్‌కు సంబంధించి సరికొత్త ప్రకటన చేసింది. ఆధార్ ఉన్న వారందరూ ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాల్సిందే..

Aadhaar card update: ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.. ఉడాయ్ కీలక ప్రకటన..
Aadhaar card update

Free Aadhaar Card Update: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. దేశంలో కోట్లాది మంది ప్రజలు కలిగిన ఈ ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి మరో అవకాశం కల్పించింది. ఆధార్ ఫ్రీ అప్‌డేషన్‌కు గడువు డిసెంబర్‌ 14తో ముగియనుండగా.. ఇప్పుడు ఆ తేదీని పొడిగించింది. 14 జూన్ 2025 వరకు ఉచిత అప్‌డేషన్‌కు అవకాశం ఇస్తున్నట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకటించింది. ఇప్పటికే అనేకసార్లు పొడగిస్తూ వచ్చిన ఉడాయ్.. ఇప్పుడు మరోసారి ఈ అవకాశం కల్పించింది. తొలుత ఉచిత అప్‌డేట్‌ గడువును జూన్ 14, 2024 వరకు ప్రకటించింది. ఆ తరువాత సెప్టెంబర్ 14, 2024 వరకు పొడిగించింది. ఆపై డిసెంబర్ 14, 2024 వరకు పొడగించింది. ఇప్పుడు ఈ తేదీని ఏకంగా జూన్ 14, 2025 వరకు పొడిగించింది. ఈ మేరకు ఆధార్ అధికారిక ‘ఎక్స్’ హ్యాండిల్‌లో వివరాలను పోస్ట్ చేసింది.


‘UIDAI ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సౌకర్యాన్ని 14 జూన్ 2025 వరకు పొడిగించింది. లక్షలాది మంది ఆధార్ నంబర్ హోల్డర్లకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఉచిత సేవ myAadhaar పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. UIDAI లో ఆధార్‌ అప్‌డేట్ చేయాలనుకునే వారు ముందుగా.. వాటికి సంబంధించిన డాక్యూమెంట్స్ దగ్గర ఉంచుకోవాలి.’ అని ఆధార్ సంస్థ సూచించింది.


ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలంటే..

1) UIDAI అధికారిక వెబ్‌సైట్‌(myAadhaar)లోని ఆధార్ సెల్ఫ్-సర్వీస్ పోర్టల్‌కి వెళ్లాలి.

2) అక్కడ మీ ఆధార్ నెంబర్ సహాయంతో లాగిన్ అవ్వాలి.

3) మీ మొబైల్‌కి వచ్చిన ఓటీపీ, క్యాప్చాను ఎంటర్ చేసిన లాగిన్ అవ్వాలి.

4) ఇప్పుడు డాక్యుమెంట్ అప్‌డేట్ విభాగానికి వెళ్లి, ఇప్పటికే ఉన్న వివరాలను సమీక్షించుకోవాలి.

5) డ్రాప్-డౌన్ లిస్ట్‌ నుంచి తగిన డాక్యుమెంట్‌ను ఎంచుకోవాలి.(అంటే ఏది అప్‌డేట్ చేయాలనుకుంటున్నారో దానిని ఎంచుకోవాలి) ధృవీకరణ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్‌ స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి.

6) సర్వీస్ రిక్వెస్ట్ నంబర్‌ను నోట్ చేసుకోవాలి. ఇది మీ ఆధార్ అప్‌డేట్ అభ్యర్థన ప్రక్రియ దశను ట్రాక్ చేయడంలో మీకు సహాయపడుతుంది.


మీ ఆధార్ కార్డ్ వివరాలను ఎందుకు అప్‌డేట్ చేయాలి?

ఏదేనా/ఏవైనా మార్పులను మీ ఆధార్ డేటాబేస్‌లో పొందుపరచాల్సిన అవసరం ఉన్నట్లయితే.. తర్వాత ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు మీరు దానిని అప్‌డేట్ చేసుకోవాలి. పిల్లల కోసం, మీరు మీ పిల్లవాడికి ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నప్పుడే ఆధార్ కోసం నమోదు చేసినట్లయితే, బయోమెట్రిక్ రికార్డును కనీసం రెండుసార్లు అప్‌డేట్ చేయవలసి ఉంటుంది. 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకసారి.. 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరొకసారి అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.


బయోమెట్రిక్ మార్పుల కోసం ఎలా అప్లై చేయాలి..

వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు, ఫోటోలు వంటి బయోమెట్రిక్‌లకు సంబంధించిన అప్‌డేట్‌లు అన్నీ ఆఫ్‌లైన్‌లోనే జరుగుతాయి. సదరు వ్యక్తులు తప్పనిసరిగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.


ఆఫ్‌లైన్‌లో ఇలా అప్లై చేయండి..

  • ముందుగా దరఖాస్తు ఫారమ్‌ తీసుకోవాలి.

  • అవసమైన సమాచారాన్ని ఆ ఫారమ్‌లో నింపాలి.

  • ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రంలో దీనిని సమర్పించాలి.

  • బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలి.

  • రసీదును తీసుకోవాలి. ఇది మీ అప్లికేషన్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందనే విషయం తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది.

Updated Date - Dec 16 , 2024 | 07:18 AM