Jayesh Pujari: కోర్టులో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు
ABN , Publish Date - Jun 12 , 2024 | 08:37 PM
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బెదిరించిన నిందితుడు గ్యాంగ్‌స్టర్ జయేష్ పూజారీ.. బుధవారం కోర్టులో పాకిస్థాన్ అనుకూలంగా నినాదాలు చేశాడు. దీంతో అతడిని పోలీసులు బలవంతంగా కోర్టు నుంచి బయటకు తీసుకెళ్లారు.
బెంగుళూరు, జూన్ 12: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బెదిరించిన నిందితుడు గ్యాంగ్‌స్టర్ జయేష్ పూజారీ.. బుధవారం కోర్టులో పాకిస్థాన్ అనుకూలంగా నినాదాలు చేశాడు. దీంతో అతడిని పోలీసులు బలవంతంగా కోర్టు నుంచి బయటకు తీసుకెళ్లారు. అనంతరం అతడిని ఏపీఎంసీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కర్ణాటక ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్‌కు ప్రాణ హాని తలపెట్టిన కేసులో అతడిని పోలీసులు బుధవారం బెళగావి జిల్లా కోర్టుకు తీసుకు వచ్చారు.
ఆ క్రమంలో కోర్టులో అతడు పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. అయితే పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో జయేష్ పూజారీపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. జయేష్ పూజారీ స్వస్థలం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా. ప్రస్తుతం అతడు హిండల్గ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.
ఓ హత్య కేసులో జయేష్ పూజారీకి ఉరిశిక్ష వేసింది. ఆ క్రమంలో అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే గతేడాది నాగపూర్‌లోని నితిన్ గడ్కరీ కార్యాలయానికి ఫోన్ చేసి.. రూ. 100 కోట్లు డిమాండ్ చేశాడు. ఆ నగదు మొత్తం ఇవ్వకుంటే గడ్కరీని హత్య చేస్తామంటూ బెదిరించారు. దీనిపై కేసు నమోదు చేశారు.
అనంతరం దర్యాప్తులో భాగంగా పోన్ కాల్స్‌ను ఎక్కడ నుంచి వచ్చాయంటూ ఆరా తీశారు. ఆ క్రమంలో ఈ కాల్స్ జయేష్ పూజారీ చేసినట్లు గుర్తించారు. అయితే జయేష్ ... దావుద్ ఇబ్రహీం ముఠా సభ్యుడని పోలీసులు తెలిపారు. అలాగే జైలు నుంచే నితిన్ గడ్కరీ కార్యాలయానికి పోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులు వివరించారు.
Read Latest Andhra Pradesh News and Telugu News