PM Modi: దసరా ఉత్సవాల వేళ.. అమ్మవారి కిరీటం చోరీ
ABN , Publish Date - Oct 11 , 2024 | 12:00 PM
2021లో ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా జేషోరేశ్వరి దేవి శక్తిపీఠాన్ని ఆయన సందర్శించారు. ఆ క్రమంలో వెండితో చేసిన బంగారం పూత కలిగిన కిరీటాన్ని అమ్మవారికి ప్రధాని మోదీ కానుకగా అందజేశారన్నారు. శక్తి పీఠాల్లో ఒకటైన జేషోరేశ్వరి దేవాలయం.. సత్ఖిరాలోని ఈశ్వరీపూర్‌లో ఉంది.
ఢాకా, అక్టోబర్ 11: దేవి నవరాత్రలు భారత్‌లోనే కాదు పొరుగునున్న బంగ్లాదేశ్‌లో సైతం ఘనంగా జరుగుతున్నాయి. అలాంటి వేళ బంగ్లాదేశ్‌లోని సత్కారాలో జేషోరేశ్వరి ఆలయంలో కొలువు తీరిన కాళీమాత కిరీటం చోరీకి గురయ్యింది. దేవాలయంలోని అమ్మవారికి ఈ కిరీటాన్ని భారత ప్రధాని కానుకగా అందజేశారు. ఈ కిరీటం చోరీ కావడంతో.. స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ మీడియా శుక్రవారం వెల్లడించింది.
Also Read: హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ.. ఎందుకంటే
గురువారం దేవాలయంలో ఎప్పటిలాగే అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయాన్ని పని వారు శుభ్రం చేశారు. ఆ సమయంలో అమ్మవారి విగ్రహానికి కిరీటం లేనట్లు వారు గుర్తించారు. దీంతో ఆ దేవాలయంలో అమ్మవారికి వంశపారంపర్యంగా పూజలు నిర్వహిస్తున్న జ్యోతి ఛటోపాధ్యాయకు వారు సమాచారం అందించారు.
Also Read: దసరా వేళ హైదరాబాద్‌లో అమ్మవారికి అవమానం
దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా సీసీ కెమెరా ఫుటేజ్‌లను వారు పరిశీలిస్తున్నారు. భారతదేశంతోపాటు పొరుగునున్న దేశాల్లో 51 శక్తి పీఠాలున్నాయి. వాటిలో బంగ్లాదేశ్‌లోని జేషోరేశ్వరి దేవి ఆలయం ఒకటి.
Also Read: బొప్పాయి వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా..?
2021లో ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా జేషోరేశ్వరి దేవి శక్తిపీఠాన్ని ఆయన సందర్శించారు. ఆ క్రమంలో వెండితో చేసిన బంగారం పూత కలిగిన కిరీటాన్ని అమ్మవారికి ప్రధాని మోదీ కానుకగా అందజేశారన్నారు. శక్తి పీఠాల్లో ఒకటైన జేషోరేశ్వరి దేవాలయం.. సత్ఖిరాలోని ఈశ్వరీపూర్‌లో ఉంది.
12వ శతాబ్దంలో అనారీ అనే బ్రాహ్మణుడు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు సమాచారం. దాదాపు 100 ద్వారాలతో ఆయన ఈ దేవాలయాన్ని నిర్మించారు. 13వ శతాబ్దంలో లక్ష్మణ్ సేన్.. ఈ దేవాలయానికి మరమ్మతులు నిర్వహించారు. ఇక 16వ శతాబ్దంలో రాజా ప్రతాపాధిత్య ఈ దేవాలయాన్ని పునర్ నిర్మించారు.
ఇక ప్రధాని మోదీ గతంలో బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా.. ఈ దేవాలయం వద్ద కమ్యూనిటీ హాల్ భారత్ నిర్మిస్తుందని హామీ ఇచ్చారు. దీనిని సాంఘిక, మతపరంగా, విద్యా కార్యక్రమాలకే కాకుండా.. తుపాన్ వంటి పెను ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలు తలదాచుకునేందుకు సైతం ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ విద్యార్థి లోకం దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనకు ప్రజలు సైతం మద్దతు ప్రకటించారు. ఈ ఆందోళనలతో దేశంలో హింస భారీగా చెలరేగింది. దీంతో విద్యార్థులను ప్రభుత్వం చర్చలు ఆహ్వానించింది. ఆ చర్చలు సైతం సఫలం కాలేదు. ఆ కొద్ది రోజులకే దేశ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్త ఆందోళన ప్రారంభమైంది.
ఈ ఆందోళన ఉదృతం కావడంతో.. షేక్ హసీనాకు మరో మార్గం లేకపోయింది. దీంతో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసింది. ఆ తర్వాత ఆమె.. పొరుగునున్న భారత్‌కు వచ్చి తలదాచుకుంది. ఇంతలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం ఆ దేశంలో పరిస్థితులు చక్కబడ్డాయి. అయితే షేక్ హాసినాను తమకు అప్పగించాలంటూ భారత్‌కు బంగ్లాదేశ్ విజ్ఞప్తిచేసింది. కానీ ఈ విషయంపై భారత్ మాత్రం స్పందించలేదు. అలాంటి వేళ ప్రధాని మోదీ.. అమ్మవారికి కానుకగా ఇచ్చిన కిరీటాన్ని దొంగిలించి ఉంటారనే ఓ ప్రచారం సైతం సాగుతుంది.
For National News And Telugu News