Kolkata: ఈడీ తనిఖీలు.. రూ. 6.5 కోట్ల విలువైన బంగారం పట్టివేత
ABN , Publish Date - Sep 08 , 2024 | 06:31 PM
కోల్‌కతాలో వ్యాపారవేత్త స్వపన్ సాహా నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆదివారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్బంగా 9 కేజీల బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కోల్‌కతా, సెప్టెంబర్ 08: కోల్‌కతాలో వ్యాపారవేత్త స్వపన్ సాహా నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆదివారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్బంగా 9 కేజీల బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనితోపాటు భారీ నగదు, పలు డాక్యుమెంట్లను సైతం ఈడీ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఈ బంగారం విలువ రూ. 6.5 కోట్లు ఉంటుందని వారు వివరించారు.
Also Read: Bihar: మగధ్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
పట్టుబడిన బంగారంపై పలు ప్రశ్నలు సంధించగా.. వాటిని సరైన సమాధానాలు స్వపన్ సాహా ఇవ్వలేదన్నారు. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఢిల్లీ వేదికగా జరిగే తమ విచారణకు హాజరు కావాలని స్వపన్‌కు సమన్లు జారీ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున బంగారం లభించడంతో.. అందుకు సంబంధించిన పత్రాలను సైతం ఢిల్లీకి తీసుకు రావాలని ఆ సమన్లలో ఈడీ స్పష్టం చేశారు.
Also Read: Video Viral: వీడెవడండీబాబు.. వినాయకుడి చేతిలో లడ్డూ ఎత్తుకెళ్లాడు..
పశ్చిమ బెంగాల్‌లో కోట్లాది రూపాయల బ్యాంకు మోసం కేసులో స్వపన్ సాహాపై భారీగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా మహానగరంలో సాల్ట్ లేక్‌లోని స్వపన్ సాహా నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
Also Read: Kolkata: ఎంపీ పదవికి రాజీనామా.. సీఎం మమతకు ఘాటు లేఖ
Read More National News and Latest Telugu News Click Here