Lok Sabha elections 2024: తొలి దశ పోలింగ్.. డూడుల్ విడుదల చేసిన గూగుల్
ABN , Publish Date - Apr 19 , 2024 | 04:24 PM
దేశంలో లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గూగుల్.. డూడుల్‌ను విడుదల చేసింది. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు వేలి మీద ఇంకుతో మార్క్ చేసినట్లుగా డూడుల్‌ను గూగుల్ విడుదల చేసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశంలో లోక్‌సభ ఎన్నికల తొలి దశ (Lok Sabha Elections 2024) పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గూగుల్.. డూడుల్ (google doodle)ను విడుదల చేసింది. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు వేలి మీద ఇంకుతో మార్క్ చేసినట్లుగా డూడుల్‌ను గూగుల్ విడుదల చేసింది.
దీనిని గూగుల్.. తన సెర్చింజన్ పేజిలో పెట్టింది. భారత ఎన్నికలకు ప్రతీకగా గూగుల్ దీనిని రూపొందించింది. ఈ డూడుల్ మీద క్లిక్ చేయగానే.. తొలి దశ పోలింగ్‌కు సంబంధించిన సమగ్ర సమాచారం గూగుల్‌లో ఆవిష్కృతమవుతుంది. ఇక ఈ రోజు ప్రారంభమైన ఈ తొలి దశ పోలింగ్‌లో 21 రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికలు.. మొత్తం 7 దశల్లో జరగనున్నాయి.
YS Vijayamma: అమ్మకు బర్త్ డే విషెష్ చెప్పిన షర్మిలమ్మ
నేటి నుంచి మొదలైన పోలింగ్ జూన్ 1వ తేదీతో ముగియనుంది. అంటే మొత్తం 44 రోజుల పాటు దశల వారిగా ఈ ఎన్నికల క్రతువు జరగనుంది. జూన్ 4వ తేదీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదే రోజు కేంద్రంలో కొలువు తీరనున్న రాజకీయ పార్టీ ఏది అనే అంశంపై అటు పార్టీల నాయకులకే కాదు.. దేశ ప్రజలకు సైతం ఓ క్లారిటీ అయితే రానుంది.
LokSabha Elections: గాంధీనగర్‌లో నామినేషన్ వేసిన అమిత్ షా
ఇక ముచ్చటగా మూడోసారి కూడా అధికారాన్ని అందుకోవాలని ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు వ్యూహాత్మకంగా అడుగు వేస్తున్నాయి. అయితే మోదీ పాలనకు చరమ గీతం పాడాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ క్రమంలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపింది. ఆ క్రమంలో ఇండియా కూటమి ఏర్పాటు అయింది. అయితే ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టారని తెలియాలంటే మాత్రం జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.
AP Election 2024: చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేసిన నారా భువనేశ్వరి
మరోవైపు ప్రత్యేకమైన శెలవుదినాలు వచ్చిన, పర్వదినాలు, ఎవరైన ప్రముఖుల జయంతి, వర్ధంతులకు గౌరవం సూచికంగా గూగుల్ తనదైనశైలిలో డూడుల్ రూపొందించి విడుదల చేస్తుంది. దీనిని గూగుల్ తన సెర్చి ఇంజిన్ హోమ్ పేజిలో పెడుతుంది.
జాతీయ వార్తలు కోసం...