Google map: వామ్మో... గూగుల్ మ్యాప్! మెట్లపై చిక్కుకున్న కారు
ABN , Publish Date - Jan 30 , 2024 | 11:22 AM
గూగుల్ మాప్(Google map) చూపిన మార్గంలో వెళ్లిన కారు మెట్లపై చిక్కుకుంది. నీలగిరి జిల్లా ఊటీకి పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు.
పెరంబూర్(చెన్నై): గూగుల్ మాప్(Google map) చూపిన మార్గంలో వెళ్లిన కారు మెట్లపై చిక్కుకుంది. నీలగిరి జిల్లా ఊటీకి పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. వరుస సెలవుల నేపథ్యంలో మూడు రోజులు ఊటీ వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో, కర్ణాటక(Karnataka)కు చెందిన కొందరు యువకులు కారులో ఊటీకి వచ్చారు. పర్యాటక ప్రాంతాలను సందర్శించిన వారు ఆదివారం సాయంత్రం గూడలూరు నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. రోడ్డు మార్గం తెలియని వారు గూగుల్ మ్యాప్ ఆధారంగా వాహనం నడుపుతున్నారు. మ్యాప్‌లో చూపిన మార్గంలో వెళ్లిన కారు మెట్లపై చిక్కుకుంది. దీంతో, స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు రెండు గంటలు శ్రమించి మెట్లపై కంకర రాళ్లు పోసి కారును సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు.