Google map: వామ్మో ‘గూగుల్ మ్యాప్’.. రిసార్ట్‌కు బదులుగా అడవిలోకి..
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:33 PM
ముదుమలైకు విహారయాత్రకు వెళ్లిన దంపతులు అటవీ ప్రాంతంలోకి వెళ్లిన ఘటన వెలుగు చూసింది. కర్ణాటకకు చెందిన దంపతులు నీలగిరి జిల్లా ఊటీకి విహారయాత్రకు బయల్దేరారు.
చెన్నై: ముదుమలైకు విహారయాత్రకు వెళ్లిన దంపతులు అటవీ ప్రాంతంలోకి వెళ్లిన ఘటన వెలుగు చూసింది. కర్ణాటకకు చెందిన దంపతులు నీలగిరి జిల్లా ఊటీకి విహారయాత్రకు బయల్దేరారు. అందుకోసం వారు కూడలూరు సమీపం తోరపల్లి ప్రాంతంలోని ఓ రిసార్ట్‌ను రిజర్వ్ చేసుకున్నారు. కర్ణాటక నుంచి కారులో రిసార్ట్‌కు బయల్దేరిన వారు గూగుల్ మ్యాప్ సాయం తీసుకున్నారు. తోరపల్లి చెక్‌పోస్ట్ దాటి అడవి మార్గంలోకి వెళుతున్న కారును అటవీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆ దంపతుల వద్ద చేపట్టిన విచారణలో వాస్తవం తెలియడంతో, వారికి సరైన మార్గం చూపి పంపించారు. కాగా, ఇటీవల ఊటీకి వెళుతున్న పలువురు పర్యాటకులు గూగుల్ మ్యాప్ ద్వారా అడవుల్లోకి వెళ్లడం గమనార్హం.