Share News

ISIS terrorists arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

ABN , Publish Date - May 20 , 2024 | 05:32 PM

గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ కీలక అరెస్టులు చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాతో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్న నలుగురు ఉగ్రవాదులను అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రంలో సోమవారంనాడు అరెస్టు చేసింది

ISIS terrorists arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

అహ్మదాబాద్: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ (ATS) కీలక అరెస్టులు చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS)తో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్న నలుగురు ఉగ్రవాదులను అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రంలో సోమవారంనాడు అరెస్టు చేసింది. వీరిని శ్రీలంక జాతీయులుగా గుర్తించారు. వీరి కార్యకలాపాలు, వ్యూహాలపై మరింత సమాచారాన్ని రాబట్టేందుకు అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఐఎస్ఎస్ఎస్ టెర్రరిస్టుల అరెస్టు నేపథ్యంలో విమనాశ్రయం చుట్టూ భద్రతను మరింత పెంచారు.

IT Raids: పరుపు పైకిలేపి చూస్తే నోట్ల కట్టల గుట్టలు.. 10 యంత్రాలతో లెక్కించాల్సిన పరిస్థితి


కాగా, అరెస్టు అయిన నలుగురు ఐఎస్ ఉగ్రవాదులను ఇంటరాగేషన్ కోసం గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకువెళ్లినట్టు సమాచారం. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఉగ్రవాదుల సంచారం వెనుక కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌ల కోసం మూడు ఐపీఎల్ టీమ్‌లు విమానాశ్రయానికి చేరుకోవడానికి ముందు ఐఎస్ ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ ఈ అరెస్టులు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read Latest National News and Telugu News

Updated Date - May 20 , 2024 | 05:34 PM