Share News

MLA Resign: కాంగ్రెస్‌కి ఎమ్మెల్యే రాజీనామా.. ఆ నిర్ణయంతో మనస్తాపం

ABN , Publish Date - Jan 20 , 2024 | 02:22 PM

అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ(Ram Mandir) కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరు కాబోదనే అధిష్టాన నిర్ణయంపై ఆ పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా గుజరాత్‌కి చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా(MLA Resign) చేశారు. విజాపూర్ నియోజకవర్గం నుంచి సీజే చావ్డా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

MLA Resign: కాంగ్రెస్‌కి ఎమ్మెల్యే రాజీనామా.. ఆ నిర్ణయంతో మనస్తాపం

గుజరాత్: అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ(Ram Mandir) కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరు కాబోదనే అధిష్టాన నిర్ణయంపై ఆ పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా గుజరాత్‌కి చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా(MLA Resign) చేశారు. విజాపూర్ నియోజకవర్గం నుంచి సీజే చావ్డా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనవరి 22న రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ వెళ్లవద్దని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తొలి నుంచి వ్యతిరేకించారు.

శనివారం పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. "25 ఏళ్లుగా కాంగ్రెస్‌లో పని చేశాను. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంతో దేశం మొత్తం హర్షం వ్యక్తం చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం వేడుకకు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం నన్ను బాధ పెట్టింది. అందుకే రాజీనామా చేస్తున్నాను. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో రామ మందిర నిర్మాణం జరగింది. దీనికి మేమంతా మద్దతివ్వాలి. కానీ కాంగ్రెస్‌లో ఉండటంతో మద్దతు ఇవ్వలేకపోయాం. అందుకే రాజీనామా చేస్తున్నా" అని ఆయన అన్నారు.

రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ శంకర్ చౌదరికి సమర్పించారు. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో కాంగ్రెస్ సంఖ్య 15కి పడిపోయింది. చావ్డా బీజేపీలో చేరతారని భావిస్తున్నారు. గతంలో ఆనంద్ జిల్లాలోని ఖంభాట్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరాగ్ పటేల్ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

Updated Date - Jan 20 , 2024 | 02:24 PM