Gujarat: గణేశ్ మండపంపై రాళ్లు.. సూరత్‌లో ఉద్రిక్తత
ABN , Publish Date - Sep 09 , 2024 | 07:40 AM
వినాయక మండపంపై రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు. ఆందోళన తీవ్రతరం కావడంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు..
దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక మండపాలు ఏర్పాటుచేసి వినాయకుడికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సూరత్‌లోని సయ్యద్‌పురా ప్రాంతంలో గణపతి మండపంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వినాయక మండపంపై రాళ్లు రువ్వడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. పోలీసు పోస్టును చుట్టుముట్టారు. వెంటనే భారీ సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సయ్యద్‌పురా ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాంతి బలార్ సంఘటనా స్థలానికి చేరుకుని.. నిందితులను వదిలిపెట్టబోమని, పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. వినాయక మండపంపై రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు. ఆందోళన తీవ్రతరం కావడంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. కొన్నిచోట్ల బాష్పవాయువు ప్రయోగించి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిని అరెస్టు చేశారు.
Elections: అందరి టార్గెట్ జమ్మూకశ్మీర్.. బీజేపీ ఆరో జాబితా విడుదల
పోలీసుల అదుపులో..
సూరత్‌లోని సయ్యద్‌పురా ప్రాంతంలోని గణేష్ మండపంపై రాళ్లు రువ్విన ఘటనలో ఆరుగురు వ్యక్తులను గుర్తించినట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. ఈ ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. వీరితో పాటు మరో 27 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోందన్నారు. సూరత్‌లోని అన్ని ప్రాంతాల్లో పోలీసు బలగాలు మోహరించాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Kolkata: ఎంపీ పదవికి రాజీనామా.. సీఎం మమతకు ఘాటు లేఖ
ఘటన జరిగిందిలా..
రాత్రి సమయంలో సయ్యద్‌పురా ప్రాంతంలో గణేష్ మండపంపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారని.. దీంతో ఘర్షణలు చెలరేగాయని సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు. శాంతి,భద్రతల సమస్య తలెత్తకుండా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూరత్ పోలీస్ కమిషనర్ తెలిపారు. అవసరమైన చోట లాఠీచార్జి చేసి టియర్ గ్యాస్ ప్రయోగించామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు.
National Politics: మీడియాకు దూరంగా ఉండండి.. బ్రిజ్ భూషణ్ సింగ్‌కు నడ్డా సలహా..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News