Share News

Gujarat: కాక్రాపర్‌లో రెండో అణు విద్యుత్‌ రియాక్టర్‌ ప్రారంభం

ABN , Publish Date - Aug 22 , 2024 | 05:59 AM

గుజరాత్‌లోని కాక్రాపర్‌ అణు విద్యుత్‌ కేంద్రం (కేఏపీఎస్‌)లో దేశీయంగా నిర్మించిన 700 మెగావాట్ల రెండో అణు విద్యుత్‌ రియాక్టర్‌ బుధవారం నుంచి పూర్తిస్థాయి

Gujarat: కాక్రాపర్‌లో రెండో అణు విద్యుత్‌ రియాక్టర్‌ ప్రారంభం

న్యూఢిల్లీ, ఆగస్టు 21: గుజరాత్‌లోని కాక్రాపర్‌ అణు విద్యుత్‌ కేంద్రం (కేఏపీఎస్‌)లో దేశీయంగా నిర్మించిన 700 మెగావాట్ల రెండో అణు విద్యుత్‌ రియాక్టర్‌ బుధవారం నుంచి పూర్తిస్థాయి సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. కేఏపీఎస్‌లోని యూనిట్‌-4 ఇప్పటివరకు తొంభై శాతం సామర్థ్యంతో పనిచేసిందని, తాజాగా వంద శాతం సామర్థ్యంతో ఇది అందుబాటులోకి వచ్చిందని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌) తెలిపింది. కాగా, ఎన్‌పీసీఐఎల్‌ ప్రస్తుతం 8,180 మెగావాట్ల సామర్థ్యంతో 24 రియాక్టర్లను నిర్వహిస్తోంది. 6,800 మెగావాట్ల సామర్థ్యమున్న 8 యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయి.

Updated Date - Aug 22 , 2024 | 05:59 AM