Share News

Ukraine: ఉక్రెయిన్‌లో హ్యారీ పోటర్‌ కోట ధ్వంసం

ABN , Publish Date - May 02 , 2024 | 04:12 AM

ఉక్రెయిన్‌లోని ఒడెసా నగరంలో నల్లసముద్ర తీరం వెంబడి ఉన్న ఓ అందమైన కట్టడం, స్థానికంగా హ్యారీపోటర్‌ కోటగా ప్రసిద్ధికెక్కిన భవనాన్ని రష్యా క్షిపణిదాడులు జరిపి ధ్వంసం చేసింది.

Ukraine: ఉక్రెయిన్‌లో  హ్యారీ పోటర్‌ కోట ధ్వంసం

క్షిపణులతో రష్యా దాడి.. ఐదుగురి మృతి

కీవ్‌, మే 1: ఉక్రెయిన్‌లోని ఒడెసా నగరంలో నల్లసముద్ర తీరం వెంబడి ఉన్న ఓ అందమైన కట్టడం, స్థానికంగా హ్యారీపోటర్‌ కోటగా ప్రసిద్ధికెక్కిన భవనాన్ని రష్యా క్షిపణిదాడులు జరిపి ధ్వంసం చేసింది. ఈ దాడిలో భవనంలో ఉన్న ఐదుగురు చనిపోయారు. 32మంది గాయపడ్డారు. ప్రైవేటు న్యాయసేవా సంస్థ తమ కార్యకలాపాల కోసం ఈ భవనాన్ని ఉపయోగించుకుంటోందని, అదొక విద్యాసంస్థ అని పలు వార్తా సంస్థలు వెల్లడించాయి.


బుధవారం రష్యా ఒడెసా నగరంపై క్షిపణులతో విరుచుకుపడింది. దాడిలో 20కి పైగా భవనాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడుల్లో రష్యా ఇస్కాండర్‌ బాలిస్టిక్‌ మిసైల్‌, క్లస్టర్‌ బాంబులను వాడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, క్రిమియాలోని తమ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ ఉక్రెయిన్‌ క్షిపణులను కూల్చిందని రష్యా ప్రకటించింది.

Updated Date - May 02 , 2024 | 04:12 AM