Nayab Singh Saini:హర్యానా సీఎం సంచలన నిర్ణయం.. ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే..
ABN , Publish Date - Oct 18 , 2024 | 05:54 PM
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీర్ఘకాలికంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రోగులకు ఉచిత డయాలసిస్ పథకాన్ని సీఎం సైనీ ప్రకటించారు. భవిష్యత్తులో అన్ని మెడికల్ కాలేజీల్లో ఉచిత డయాలసిస్ సౌకర్యం కూడా కల్పిస్తామని మరో హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఆయన రెండోసారి సీఎంగా ..
హర్యానా ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన నయాబ్ సింగ్ సైనీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. హర్యానా ప్రజలకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీర్ఘకాలికంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రోగులకు ఉచిత డయాలసిస్ పథకాన్ని సీఎం సైనీ ప్రకటించారు. భవిష్యత్తులో అన్ని మెడికల్ కాలేజీల్లో ఉచిత డయాలసిస్ సౌకర్యం కూడా కల్పిస్తామని మరో హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఆయన రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నెరవేర్చారు. హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది. కిడ్నీతో బాధపడుతున్న వారు డయాలసిస్ చేయించుకోవడానికి ప్రతి నెలా వేల రూపాయిలు ఖర్చు చేయాల్సి వస్తుంది. హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వేలమంది పేద ప్రజలకు లబ్ధిచేకూరనుంది.
Ani Master: జానీ మంచివారు...నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి
రెండోసారి సీఎంగా..
నాయబ్ సింగ్ సైనీ రెండోసారి హర్యానా ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం సైనీతో పాటు 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ ఏడాది మార్చి 12న ఆయన మొదటిసారి హర్యానా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత రెండు పర్యాయలతో పోలిస్తే హర్యానాలో ఈసారి బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుని చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. నయబ్ సింగ్ సైనీ మంత్రివర్గంవలో అనిల్ విజ్, కృష్ణ లాల్ పన్వార్, రావు నర్బీర్మహిపాల్ దండా, విపుల్ గోయల్, అరవింద్ శర్మ, శ్యామ్ సింగ్ రాణా, రణబీర్ గాంగ్వా, కృష్ణ బేడి, శృతి చౌదరి, ఆర్తీ రావు, రాజేష్ నగర్,గౌరవ్ గౌతమ్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
Harish Rao: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ ఏ రేంజ్‌లో సవాల్ విసిరారంటే
మూడోసారి బీజేపీ ప్రభుత్వం
హర్యానాలో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హర్యానాలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి 48 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 37 సీట్లు గెలుచుకుంది. గురువారం జరిగిన సైనీ ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా పలువురు ఎన్డీయే నేతలు హాజరైన విషయం తెలిసిందే.
Also Read..
రేవంత్ రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు
మార్కెట్లోకి అదిరిపోయే ఈవీ బైక్.. ఫీచర్లు తెలిస్తే
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here