Hathras stampede: ఎఫ్ఐఆర్‌లో లేని ‘బోలే బాబా’.. కోవిడ్‌లో సైతం సత్సంగం
ABN , Publish Date - Jul 03 , 2024 | 02:36 PM
ఉత్తరప్రదేశ్ హాథ్రాస్‌లో సత్సంగ్ నేపథ్యంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 121 మంది మరణించారు. ఈ ఘటనలో 28 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ క్రమంలో సత్సంగ్ నిర్వాహకులపై సికిందరావ్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
లఖ్‌నవూ, జులై 03: ఉత్తరప్రదేశ్ హాథ్రాస్‌లో సత్సంగ్ నేపథ్యంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 121 మంది మరణించారు. ఈ ఘటనలో 28 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ క్రమంలో సత్సంగ్ నిర్వాహకులపై సికిందరావ్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్య సేవాదర్ దేవ్ ప్రకాశ్ మధుకర్‌తోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సత్సంగ్‌లో ప్రసంగించిన బోలే బాబా పేరు మాత్రం ఎఫ్‌ఐఆర్‌లో నమోదు కాకపోవడం గమనార్హం. అయితే ఈ దుర్ఘటనకు కారణమైన బోలేబాబు పేరు ఎఫ్ఐఆర్‌లో లేక పోవడంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు అయింది. మరోవైపు 3.30 గంటలకు.. అంటే ఈ తొక్కిసలాట ఘటన చోటు చేసుకునే ముందే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారనే ఓ వాదన అయితే బలంగా వినిపిస్తుంది.
Also Read: Harthas incident: మృతదేహాలు చూసి తట్టుకోలేక పోయాడు.. పాపం..
ఇక మోదీ ప్రభుత్వం కొత్త చట్టాలను అమల్లోకి తీసుకు వచ్చిన మరునాడే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో భారతీయ న్యాయ సన్నిహితలోని పలు సెక్షన్ల కింద సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇంకోవైపు గతంలో కోవిడ్ సమయంలో సైతం ఈ బోలే బాబా తన సత్సంగాన్ని నిర్వహించినట్లు వార్తలు అయితే ఈ సందర్బంగా అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోవిడ్ సమయంలో బోలే బాబా సత్సంగానికి కేవలం 50 మంది మాత్రమే హాజరయ్యేందుకు పోలీసులు అనుమతించారు.
కానీ ఆ సమయంలో దాదాపు 50 వేల మంది ఈ సత్సంగానికి హాజరయ్యారనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా జరిగిన సత్సంగానికి కేవలం 80 వేల మందికి మాత్రమే అనుమతించారు. కానీ 250000 లక్షల మంది ‘దీనికి’ హాజరయ్యారు. దాంతో భారీగా మృతుల సంఖ్య భారీగా పెరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. ఈ సత్సంగానికి ఎంతమందికి అనుమతిచ్చాం. ఎంత మంది హాజరయ్యారనే విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడంతో.. ఈ ఘటన తాలుక విషాదం భారీగా ఉందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.
Read Latest National News and Telugu News