Hathras Stampede: ప్రమాదమా? కుట్రా?.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన యోగి
ABN , Publish Date - Jul 03 , 2024 | 03:41 PM
ధార్మిక సంబంధమైన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన నేపపథ్యంలో హత్రాస్ జిల్లాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారంనాడు పర్యటించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? ఇందులో కుట్ర కోణం ఉందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశాలిచ్చారు.
హత్రాస్: ధార్మిక సంబంధమైన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన నేపపథ్యంలో హత్రాస్(Hathras) జిల్లాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) బుధవారంనాడు పర్యటించారు. అక్కడి నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వైద్యులను పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. హత్రాస్ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? ఇందులో కుట్ర కోణం ఉందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశాలిచ్చారు.
హత్రాస్ ఘటనలో నిజానిజాలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని యోగి ఆదిత్యానాథ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇంతటి విషాద ఘటనను రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. ప్రభుత్వం చాలా సున్నితమైన అంశంగా ఈ ఘటనను భావిస్తోందని చెప్పారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా, కుట్ర కోణం ఉందా అనే విషయాన్ని లోతుగా విచారణ జరుపుతామని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Hathras stampede: ఎఫ్ఐఆర్‌లో లేని ‘బోలే బాబా’.. కోవిడ్‌లో సైతం సత్సంగం
ఘటనా స్థలిలో ఫోరెన్సిక్ టీమ్
మరోవైపు, ఫోరెన్సిక్ టీమ్, డాగ్ స్క్వాడ్ సైతం ఘటనా స్థలికి చేరుకుని ఘటనా స్థలి నుంచి కీలక సాక్ష్యాలను సేకరిస్తోంది. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ టీమ్‌లు ప్రమాద స్థలిలో గాలింపు, సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఘటనకు కారణంపై ఆగ్రా ఏడీజీ, అలిగఢ్ డివిజనల్ కమిషనర్ దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు నివేదికను 24 గంటల్లోగా వీరు సమర్పిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
121కి చేరిన మృతుల సంఖ్య
కాగా, 'సత్సంగం'లో పాల్గొన్న సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కి చేరుకుందని, వీరిలో ఎక్కువమందిని గుర్తించామని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. తక్కిన మృతదేహాలను కూడా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రచారం చివరల్లో బోలో బాబాను చూసేందుకు భక్తులు పోటీపడటంతో తొక్కిసలాట జరిగినట్టు చెబుతున్నారు. బాబా పాదాల కింద మట్టి (పాదధూళి) తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారని తెలుస్తోంది. సత్యంగ కార్యక్రమం ప్రైవేట్ ఫంక్షన్ అని, దీనికి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పర్మిషన్ ఇచ్చారని డిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ తెలిపారు. స్థానిక యంత్రాగం సభాస్థలి వెలుపల భద్రత కల్పించగా, వెన్యూ లోపల ఏర్పాట్లను ఆర్గనైజర్లు చూసుకున్నట్టు చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..