Share News

Helicopter: ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిన హెలికాప్టర్.. కీలక నేతకు..

ABN , Publish Date - May 03 , 2024 | 12:53 PM

మహారాష్ట్రలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ శుక్రవారం కుప్పకూలింది. శివసేనకు చెందిన కీలక నేతను పికప్ చేసుకునేందుకు హెలికాప్టర్ వచ్చినట్లు తెలుస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శివసేన నేత సుష్మా అంధారే(Sushma Andhare)ను తీసుకెళ్లేందుకు బయలుదేరిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ల్యాండింగ్‌లో ఉండగానే అకస్మాత్తుగా కూలిపోయింది.

Helicopter: ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిన హెలికాప్టర్.. కీలక నేతకు..

ముంబయి: మహారాష్ట్రలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ శుక్రవారం కుప్పకూలింది. శివసేనకు చెందిన కీలక నేతను పికప్ చేసుకునేందుకు హెలికాప్టర్ వచ్చినట్లు తెలుస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శివసేన నేత సుష్మా అంధారే(Sushma Andhare)ను తీసుకెళ్లేందుకు బయలుదేరిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ల్యాండింగ్‌లో ఉండగానే అకస్మాత్తుగా కూలిపోయింది. అంధారే సదరు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ఆ వీడియోలో ఓ ఛాపర్ ల్యాండింగ్ కావడానికి ప్రయత్నించగా.. ఓపెన్ గ్రౌండ్‌లో దుమ్మురేపుతూ పెద్ద శబ్దంతో కుప్పకూలింది. రాయ్‌గఢ్‌లోని మహద్ పట్టణంలో జరిగిన ఈ ప్రమాదంలో పైలట్ చాపర్ నుంచి బయటకి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

జిల్లాలో ఎన్నికల ప్రచారం నిమిత్తం సుష్మా అంధారే అదే హెలికాప్టర్‌లో(Helicopter Crash) వెళ్లాల్సి ఉండింది. ఈ క్రమంలోనే ప్రమాదం జరగడంతో సుష్మ తృటిలో తప్పించుకున్నారు. ప్రచారాన్ని కొనసాగించడానికి ఆమె కారులో వెళ్లిపోయారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 03 , 2024 | 12:53 PM