Share News

Delhi: మెషిన్‌గన్‌తో విరుచుకుపడే ‘హెక్సాకాప్టర్‌’

ABN , Publish Date - May 16 , 2024 | 03:11 AM

భారత రక్షణ రంగంలో కీలక ముందడుగు పడింది. మెషిన్‌గన్‌తో శత్రువులపై విరుచుకుపడే అత్యాధునిక హెక్సాకాప్టర్‌ డ్రోన్‌ను భారత సైన్యం పరిచయం చేసింది. ‘మేకిన్‌ ఇండియా’లో భాగంగా ఇక్రాన్‌ ఏరోస్పేస్‌ అండ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ దీన్ని రూపొందించింది. ఇదొక మానవ రహిత ఏరియల్‌ వాహనం (యూఏవీ).

Delhi: మెషిన్‌గన్‌తో విరుచుకుపడే ‘హెక్సాకాప్టర్‌’

సైన్యంలోకి సరికొత్త డ్రోన్‌

న్యూఢిల్లీ, మే 15: భారత రక్షణ రంగంలో కీలక ముందడుగు పడింది. మెషిన్‌గన్‌తో శత్రువులపై విరుచుకుపడే అత్యాధునిక హెక్సాకాప్టర్‌ డ్రోన్‌ను భారత సైన్యం పరిచయం చేసింది. ‘మేకిన్‌ ఇండియా’లో భాగంగా ఇక్రాన్‌ ఏరోస్పేస్‌ అండ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ దీన్ని రూపొందించింది. ఇదొక మానవ రహిత ఏరియల్‌ వాహనం (యూఏవీ). ఆర్మీ ఆపరేషన్లలో ఇది సైన్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చిన్న తుపాకుల నుంచి.. గ్రనేడ్లు, మోర్టార్లు వంటి ఆయుధాల శ్రేణిని కలిగి ఉంటుంది. వివిధ పరిస్థితుల్లో దీన్ని నిఘా కోసం ఉపయోగించవచ్చు. అలాగే సామగ్రిని, మిషన్‌ గన్లను, గ్రనేడ్లను తరలించడానికి దీన్ని వాడుకోవచ్చు. ఇటీవల చిన్న ఆయుధాల టెస్ట్‌ ఫైరింగ్‌ సమయంలో ఆర్మీ అధికారులు దీని పనితీరుని పరిశీలించారు.

Updated Date - May 16 , 2024 | 03:11 AM