High temperature: వేలూరు సహా 17 జిల్లాల్లో సెగలు..
ABN , Publish Date - Apr 09 , 2024 | 09:55 AM
రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేలూరు, తిరువణ్ణామలై, ధర్మపురి(Vellore, Tiruvannamalai, Dharmapuri), కృష్ణగిరి, ఈరోడ్ సహా 17 జిల్లాల్లో మరో రెండు రోజులపాటు వడగాడ్పులు వీయనున్నాయి.
చెన్నై: రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేలూరు, తిరువణ్ణామలై, ధర్మపురి(Vellore, Tiruvannamalai, Dharmapuri), కృష్ణగిరి, ఈరోడ్ సహా 17 జిల్లాల్లో మరో రెండు రోజులపాటు వడగాడ్పులు వీయనున్నాయి. ఈ యేడాది మార్చిలోనే ఎండలు అధికమవుతూ వచ్చాయి. ఈక్రమంలో ఏప్రిల్ ఆరంభం నుంచే ఉదయం 9 గంటలకే అన్ని జిల్లాల్లో వడగాడ్పులు వీస్తున్నాయి. అదే సమయంలో సముద్రతీర జిల్లాల్లో సాయంత్రపు వేళ్లల్లో చల్లటి గాలులు వీయక పోవడంతో ఉక్కపోత అధికమై ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వేలూరు, తిరుపత్తూరు(Vellore, Tirupattur), రాణిపేట, కాంచీపురం, తిరువణ్ణామలై, కృష్ణగిరి, ధర్మపుచి, సేలం, నామక్కల్, తిరుప్పూరు, కోయంబత్తూరు, ఈరోడ్, కరూరు, తిరుచ్చి, అరియలూరు, పెరంబలూరు, నీలగిరి జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో ఎండలు దంచనున్నాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు. పగటిపూట ఉష్ణోగ్రత అధికంగా ఉండటంతో సాధ్యమైనంతవరకూ చిన్నారులు, వృద్ధులు ఇంటిపట్టునే గడపటం మంచిదని తెలిపారు. తరచూ మజ్జిగ, కొబ్బరి నీళ్లు, బెల్లం పానకం వంటి పానీయాలు తాగాలని పేర్కొన్నారు. ఆహారంలో కారం, మసాలాలు వినియోగం తగ్గించాలని, ఆకుకూరలు, కూరగాయలు అధికంగా తీసుకోవాలని తెలిపారు.