Share News

Home Minister: హోంమంత్రి అంతమాట అనేశారేంటో.. వారిద్దరే రాజకీయాలు చేసుకోనీ...

ABN , Publish Date - Dec 06 , 2024 | 11:49 AM

రాష్ట్రంలో అధికార పంపిణీ విషయమై సీఎం, డీసీఎంలు ఇటీవల రెండు రోజులుగా వ్యాఖ్యానిస్తున్న తరుణంలో హోం మంత్రి పరమేశ్వర్‌(Home Minister Parameshwar) తీవ్రమైన ఆరోపణ చేశారు. రాష్ట్రంలో అధికార పంపిణీకి సంబంధించి ఒప్పందం జరిగిందనే విషయం నాకు తెలియదన్నారు.

Home Minister: హోంమంత్రి అంతమాట అనేశారేంటో.. వారిద్దరే రాజకీయాలు చేసుకోనీ...

- మేమంతా ఎందుకు..?

- హోంమంత్రి అసంతృప్తి

బెంగళూరు: రాష్ట్రంలో అధికార పంపిణీ విషయమై సీఎం, డీసీఎంలు ఇటీవల రెండు రోజులుగా వ్యాఖ్యానిస్తున్న తరుణంలో హోం మంత్రి పరమేశ్వర్‌(Home Minister Parameshwar) తీవ్రమైన ఆరోపణ చేశారు. రాష్ట్రంలో అధికార పంపిణీకి సంబంధించి ఒప్పందం జరిగిందనే విషయం నాకు తెలియదన్నారు. ఒప్పందం జరిగిందనేది వాస్తవమైతే వారిద్దరే రాజకీయాలు జరుపుకోవాలని ఇతరులు అవసరం లేదా.. అని ప్రశ్నించారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: విమానాశ్రయంలో నక్షత్ర తాబేళ్ల స్వాధీనం..


సదాశివనగర్‌లోని నివాసం వద్ద గురువారం హోం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి(Chief Minister) పదవి విషయంలో డీసీఎం, డీసీఎంల మధ్య ఒప్పందం జరిగి ఉంటే మేమంతా ఎందుకని, వారిద్దరే రాజకీయాలు చేసుకుంటే సరిపోతుందన్నారు. ఇదంతా జరగదని, అధిష్ఠానాన్ని వీడి వెళ్లేది లేదన్నారు. ఢిల్లీ పెద్దల తీర్మానాన్ని ఒప్పుకుంటామన్నారు. ఒప్పంద విషయం మాకు తెలియదన్నారు.


pandu1.2.jpg

ఇదే విషయమై ఢిల్లీతోపాటు రాష్ట్ర నాయకులు పలువురితో మాట్లాడానని ఎవరూ ఒప్పందం విషయం తెలియదనే చెప్పారన్నారు. డీసీఎం డీకే శివకుమార్‌ ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారో తెలియదన్నారు. సీఎం సిద్దరామయ్య అటువంటి ఒప్పందం జరగలేదని బహిరంగంగానే చెప్పారన్నారు. ఎన్నికలవేళ ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చామో వాటిని నెరవేర్చాల్సిన కర్తవ్యం మాపై ఉందన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Adilabad: పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు!

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు

ఈవార్తను కూడా చదవండి: Indiramma Housing: ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!

ఈవార్తను కూడా చదవండి: సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!

Read Latest Telangana News and National News

Updated Date - Dec 06 , 2024 | 11:50 AM