Share News

Chhattisgarh Encounter: మావోలు ఎలా దాడులు చేశారు.. వెలుగులోకి షాక్‌కి గురి చేసే నిజాలు

ABN , Publish Date - Jan 31 , 2024 | 04:00 PM

మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దంతేవాడ-బిజాపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న గ్రామాల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జిల్లా రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్ బృందాలు కలిసి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.

Chhattisgarh Encounter: మావోలు ఎలా దాడులు చేశారు.. వెలుగులోకి షాక్‌కి గురి చేసే నిజాలు

మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దంతేవాడ-బిజాపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న గ్రామాల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జిల్లా రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్ బృందాలు కలిసి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. కొద్దిసేపు ఎదురుకాల్పులు జరిగిన తర్వాత మావోలు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో.. మావోలు ఈ దాడికి ఎలా ప్లాన్ చేశారు? అనే కోణంపై భద్రతా సిబ్బంది విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి.


మావోలు పక్కా ప్లానింగ్‌తోనే తమపై దాడి చేశారని, ఇందుకోసం 30 మీటర్ల పొడవైన సురంగాన్ని తవ్వారని భద్రతా సిబ్బంది గుర్తించింది. అంతేకాదు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో స్పైక్ హోల్స్‌తో ఉచ్చు కూడా బిగించినట్లు తేల్చారు. నివేదికల ప్రకారం.. భద్రతా దళంపై మావోయిస్టులు రాకెట్ ఆకారపు బారెల్స్‌ను కాల్చినట్లు తేలింది. ఈ దాడిలో డజను బారెల్ గ్రెనేడ్ లాంచర్లను (బీజీఎల్) ఉపయోగించారు. ఇది మన భారత్‌లోనే తయారు చేయబడిన మెరుగైన మందుగుండు సామాగ్రిలలో ఒకటి. మావోల వద్ద ఇలాంటి మెరుగైన పేలుడు పదార్థాలు ఉండటం, సొరంగాలతో పాటు స్పైక్ హోల్స్ సృష్టించడం చూసి.. భద్రతా బలగాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

మరోవైపు.. అదే రోజున ఛత్తీస్‌గఢ్‌లో మరో ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్‌-సుక్మా సరిహద్దుల్లో మావోయిస్టుల కార్యకలాపాలకు చెక్‌ పెట్టేందుకు భద్రతా శిబిరాన్ని ఏర్పాటు చేసి, ఆ ప్రాంత ప్రజలకు మౌలిక వసతులు కల్పించే పనిలో ఉండగా వారిపై దాడి జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. మావోయిస్టుల్లో కనీసం ఆరుగురు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. కాగా.. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ఈ దాడిని ఖండించి, ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 31 , 2024 | 04:00 PM