Share News

Abhishek Singhvi: పార్లమెంట్‌లోకి ఎంపీలు.. నగదు తీసుకు వెళ్లేందుకు లిమిట్ ఉందా..?

ABN , Publish Date - Dec 06 , 2024 | 07:53 PM

రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద నోట్ల కట్ల దొరింది. ఈ ఘటన అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాట యుద్ధానికి దారి తీసింది. అలాంటి వేళ.. సభలోకి సభ్యులు ఎంత నగదు తీసుకు వెళ్లేందుకు ఏమైనా హద్దు ఉందా అంటే..

Abhishek Singhvi: పార్లమెంట్‌లోకి ఎంపీలు.. నగదు తీసుకు వెళ్లేందుకు లిమిట్ ఉందా..?

రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద శుక్రవారం నోట్ల కట్ట లభ్యం కావడం కలకలం సృష్టించింది. దీనిపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్‌ఖడ్ దర్యాప్తునకు ఆదేశించారు. సభలో నోట్ల కట్ట లభ్యం కావడంతో.. అటు అధికార బీజేపీ, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు చెందిన సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అలాంటి వేళ.. సభలోకి సభ్యుడు తీసుకు వెళ్లేందుకు ఎంత వరకు నగదు అనుమతి ఇస్తారు. అందుకు సంబంధించిన నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అనే ఓ ప్రశ్న ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమవుతుంది.

Also Read: రాయపర్తి ఎస్‌బీఐ కేసు ఛేదించిన పోలీసులు.. ముగ్గురు అరెస్ట్


అయితే సభలోకి ఎంపీ ఎంత నగదుతో అయినా.. రావచ్చా అంటే.. పార్లమెంట్‌లో క్యాంటిన్లు, బ్యాంకులు సైతం ఉన్నాయి. చాలా మంది సభ్యులు ఈ బ్యాంకుల ద్వారా నగదు విత్ డ్రా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ లోపలికి నగదు తీసుకు వెళ్లడం నిబంధనలకు ఏ మాత్రం విరుద్దం కాదు. కానీ ఖర్చుల కోసం పరిమిత నగదును తీసుకు వెళ్లవచ్చు

Also Read: విజయవాడ వేదికగా ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకల కార్యక్రమం


కానీ సభలో పెద్ద మొత్తంలో నగదు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించ కూడదు. ఎందుకంటే.. పార్లమెంట్‌ లోపల నగదు ఉపయోగించడం లేదా ప్రదర్శించడం.. దాని గౌరవాన్ని దెబ్బ తీస్తుంది. 2008 నుంచి ఈ నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తున్నారు.

Also Read: ఆ బియ్యం సంగతి తేల్చేందుకు రంగంలోకి స్పెషల్ ఆఫీసర్


సభలోకి ఏం తీసుకు వెళ్లవచ్చు అంటే..?

సభలో సభ్యులు.. చిన్న పర్సు లేదా అవసరమైన వ్యక్తిగత వస్తువులతో కూడిన బ్యాగ్ తీసుకు వెళ్లేందుకు అనుమతించారు. మహిళా ఎంపీలు హ్యాండ్ బ్యాగ్‌లు సైతం తీసుకెళ్లవచ్చు. అది కూడా వ్యక్తిగత అవసరాలకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.

శాసనాలకు సంబంధించిన అవసరమైన పత్రాలు, నివేదికలు, బిల్లులు సభలోకి తీసుకెళ్ల వచ్చు.

డిబేట్ లేదా డిస్కషన్‌లో పాల్గొనేందుకు సిద్ధం చేసిన స్పీచ్ పేపర్ సైతం తీసుకు వెళ్లవచ్చు.

ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్ టాప్‌‌లు.. తమ వెంట తీసుకుని వెళ్లాలంటే.. ముందస్తు అనుమతి మాత్రం తప్పక తీసుకోవాల్సి ఉంటుంది.

సభలో ప్రొసీడింగ్ సమయంలో నీరు, తేలికపాటి స్నాక్స్ వంటివి తీసుకెళ్ల వచ్చు.

Also Read: హైదరాబాద్‌లో ట్యాబ్లెట్ల బిర్యానీ


ఇవి నిషేధించబడ్డాయి..?

సభ లేదా సభా కార్యకలాపాలకు అవమానకరంగా భావించే ఏదైనా ఖచ్చితంగా నిషేధించబడింది.

నిరసనలో భాగంగా ఉపయోగించే ప్లకార్డులు, పోస్టర్లు, బ్యానర్లు వంటి వస్తువులను పార్లమెంటు లోపలికి తీసుకెళ్ల కూడదు.

నోట్ల కట్టలను.. ముఖ్యంగా పెద్ద మొత్తంలో సభలోకి తీసుకెళ్లడం ఖచ్చితంగా నిషేధించారు.

రికార్డింగ్ లేదా ఫోటోగ్రాఫ్ తీయడానికి ఉపయోగించే పరికరాలను అనుమతి లేకుండా సభలోకి తీసుకు వెళ్లకూడదు.

Also Read: బెల్లం సున్నుండ తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

For National News And Telugu news

Updated Date - Dec 06 , 2024 | 07:57 PM