Share News

Bihar Politics: బిహార్‌ అసెంబ్లీలో పార్టీల బలాబలాలు.. భవిష్యత్తు రాజకీయాలు ఇవే

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:28 AM

రాష్ట్రీయ జనతాదళ్ (RJD)తో రెండేళ్ల అనుబంధానికి జనతాదళ్ (యునైటెడ్) ముగింపు పలికి సీఎం నితీష్ కుమార్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీ (BJP) తో పొత్తు పెట్టుకుని మళ్లీ సీఎంగా ఇదే రోజు సాయంత్రం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

Bihar Politics: బిహార్‌ అసెంబ్లీలో పార్టీల బలాబలాలు.. భవిష్యత్తు రాజకీయాలు ఇవే

పట్నా:రాష్ట్రీయ జనతాదళ్ (RJD)తో రెండేళ్ల అనుబంధానికి జనతాదళ్ (యునైటెడ్) ముగింపు పలికి సీఎం నితీష్ కుమార్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీ (BJP) తో పొత్తు పెట్టుకుని మళ్లీ సీఎంగా ఇదే రోజు సాయంత్రం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. JD(U) ఇప్పటికే తమ పార్టీ నేతల మద్దతు కూడగట్టింది.

నితీష్ కుమార్ 2022లో బీజేపీతో తెగతెంపులు చేసుకొని మాజీ సీఎం లాలూ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి 'మహాఘటబంధన్' ఏర్పాటు చేసి సీఎం పదవి చేపట్టారు. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీలో ప్రస్తుతం 79 మంది ఎమ్మెల్యేలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2020 ఎన్నికల్లో ఏ పార్టీ కూడా మేజిక్ మార్క్ 122 సీట్లను దాటలేదు. 78 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

బలాబలాలివి..(2020 ఎన్నికల ప్రకారం - 243 సీట్లకుగానూ)

ఆర్జేడీ - 79

బీజేపీ - 78

JD(U) - 45

కాంగ్రెస్ - 19

CPI (ML) - 12

హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) - 4

సీపీఐ - 2

సీపీఐ (ఎం) - 2

స్వతంత్ర ఎమ్మెల్యే - 1


జేడీయూ, బీజేపీ కలిస్తే..

నితీష్ కుమార్, బీజేపీ చేతులు కలిపితే వారి సంఖ్య మ్యాజిక్ ఫిగర్ కంటే ఒకటి ఎక్కువగా ఉంటుంది. బీజేపీకి హిందుస్థానీ అవామ్ మోర్చా మద్దతు కూడా ఉంది. వారు మరోనలుగురు ఉన్నారు. తద్వారా కూటమికి మెజారిటీ నిరూపించడం సులభం అవుతుంది.

రాష్ట్రంలోని జేడీయూ శాసనసభ్యులందరూ ఇప్పటికే నితీష్ కుమార్‌ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ లేఖలు ఇచ్చారని బీజేపీ తెలిపింది. నితీష్‌ని సీఎం పదవి నుంచి తప్పించే బదులు ఆర్జేడీ మంత్రుల స్థానంలో బీజేపీ ఎమ్మెల్యేలతో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని బీజేపీ పట్టుబట్టేలా కనిపిస్తోంది.

Updated Date - Jan 28 , 2024 | 11:28 AM