IAS officers: 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ..
ABN , Publish Date - Jun 15 , 2024 | 12:56 PM
రాష్ట్రవ్యాప్తంగా 13 మంది ఐఏఎస్ అధికారులను(IAS officers) బదిలీ చేస్తూ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా(Shivdas Meena) ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ, ఎంబీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి రీటా హరీస్ టక్కర్ ప్రజా, పునరుజ్జీవన శాఖ కార్యదర్శిగాను, ఆ శాఖ కార్యదర్శి నందకుమార్ మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు.
చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా 13 మంది ఐఏఎస్ అధికారులను(IAS officers) బదిలీ చేస్తూ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా(Shivdas Meena) ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ, ఎంబీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి రీటా హరీస్ టక్కర్ ప్రజా, పునరుజ్జీవన శాఖ కార్యదర్శిగాను, ఆ శాఖ కార్యదర్శి నందకుమార్ మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. దివ్యాంగులు, మానవవనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి నాగరాజన్ ఆర్థిక శాఖ కార్యదర్శిగాను, సెలవుపై ఉన్న దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి థామస్ వైద్యన్ మళ్లీ అదేశాఖకు నియమితులయ్యారు.
ఇదికూడా చదవండి: Cheetah: వామ్మో.. చిరుత ప్రైవేటు పాఠశాలలోకి చొరబడిందిగా...
తమిళనాడు గృహవసతి శాఖ మేనేజింగ్ డైరెక్టర్ శవరణ సెల్వరాజ్ భౌగోళిక, సొరంగాల శాఖ కమిషనర్‌గాను, తమిళనాడు(Tamil Nadu) చక్కెర పరిశ్రమల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్‌రాజ్‌కుమార్ బీసీ, ఎంబీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. వీరితో సహా 13 మంది వివిధ శాఖలకు బదిలీ అయ్యారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News