Share News

IAS Rohini: ఐఏఎస్‌ రోహిణి సింధూరి వేతనంలో కోత విధించండి...

ABN , Publish Date - May 30 , 2024 | 01:17 PM

మైసూరు జిల్లా అధికారిగా పనిచేసిన రోహిణి సింధూరి(Rohini Sindhuri) అక్కడి అతిథిగృహంలో ఉండేవారు. ఇదే సందర్భంలో పలు వస్తువులు మాయమయ్యాయి. వాటికి సంబంధించి నగదు సమకూర్చాలని పర్యవేక్షణ సంస్థ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం రోహిణి సింధూరి వేతనం నుంచి కోత విధించాలని ప్రభుత్వాన్ని కోరింది.

IAS Rohini: ఐఏఎస్‌ రోహిణి సింధూరి వేతనంలో కోత విధించండి...

- మైసూరు అతిథిగృహంలో సామగ్రి మాయం

- ప్రభుత్వానికి ఏటీఐ ఫిర్యాదు

బెంగళూరు: మైసూరు జిల్లా అధికారిగా పనిచేసిన రోహిణి సింధూరి(Rohini Sindhuri) అక్కడి అతిథిగృహంలో ఉండేవారు. ఇదే సందర్భంలో పలు వస్తువులు మాయమయ్యాయి. వాటికి సంబంధించి నగదు సమకూర్చాలని పర్యవేక్షణ సంస్థ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం రోహిణి సింధూరి వేతనం నుంచి కోత విధించాలని ప్రభుత్వాన్ని కోరింది. మైసూరు(Mysore) అతిథిగృహంలో కనిపించకుండా పోయిన వస్తువుల విలువ రూ.77,296 ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఏటీఐ) విన్నవించింది. 2020 అక్టోబరు నుంచి నవంబరు 14 దాకా మైసూరులోని పాలనా శిక్షణా సంస్థ అతిథి గృహంలో రోహిణి సింధూరి ఉన్నారు. అక్కడ విలువైన వస్తువులు మాయమయ్యాయని 2020 డిసెంబరు 16న తొలిసారి, 2021 జనవరి 8న, ఏప్రిల్‌ 12న సదరు సంస్థ వస్తువులను వాపసు చేయాలని రోహిణిసింధూరికి లేఖ రాశారు. ఈ లేఖలపై ఆమె ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. 2022 నవంబరు 30న మరో లేఖ పంపారు.

ఇదికూడా చదవండి: Chennai: కొండెక్కిన కొత్తిమీర.. అమాంతం పెరిగిన ధర.. కట్ట రూ.100


జిల్లా అధికారి అతిథిగృహంలో ఎటువంటి వస్తువులు లేవని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత రోహిణి సింధూరి దేవదాయశాఖ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న సందర్భంలోనూ అతిథిగృహం సామగ్రిని వాపసు చేయాలని ఏటీఐ కోరింది. 2023 జనవరి 15న లేఖ అందినా ఆమె ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ మేరకు ఆమె వేతనం నుంచి కోత విధించి సామగ్రి మొత్తాన్ని వసూలు చేయదలిచి ప్రభుత్వాన్ని సంస్థ ప్రతినిధులు కోరినట్టు సమాచారం. కనిపించకుండా పోయిన సామగ్రిలో టెలిఫోన్‌ టేబుల్‌, కోట్‌ హ్యాంగర్‌, బ్లాంకెట్‌, మైక్రో ఓవెన్‌, కుర్చీలు, పరుపు, కంప్యూటర్‌ మౌజ్‌, ట్రే, యోగామ్యాట్‌, టెలిఫోన్‌ స్టూల్‌, ప్లేట్‌, టీపాయ్‌, రిసెప్షన్‌ టెలిఫోన్‌, మంచంతోపాటు పలు వస్తువులు ఉన్నట్టు ఏటీఐ తన లేఖలో పేర్కొంది.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 30 , 2024 | 01:20 PM