Share News

Arvind Kejriwal: ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ను గెలిపించకుంటే..

ABN , Publish Date - Sep 20 , 2024 | 04:49 PM

మరికొద్ది రోజుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న అతిషి సింగ్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్నుకోవాలని న్యూఢిల్లీ ఓటర్లకు అతిషి పిలుపునిచ్చారు.

Arvind Kejriwal: ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ను గెలిపించకుంటే..

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: మరికొద్ది రోజుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న అతిషి సింగ్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్నుకోవాలని న్యూఢిల్లీ ఓటర్లకు అతిషి పిలుపునిచ్చారు. ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోకుంటే.. బీజేపీ పాలనలోని ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న పరిస్థితులే ... న్యూఢిల్లీలో సైతం సంభవిస్తాయన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను సీఎంగా గెలిపించకుంటే.. దేశ రాజధాని న్యూఢిల్లీలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరుగుతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: Tirumala Laddu: తిరుమల లడ్డూను ఎలా తయారీ చేస్తారంటే..?

Also Read: Karnataka High Court: న్యాయమూర్తి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ .. స్పందించిన సుప్రీంకోర్టు


అలాగే నిరంతరాయంగా న్యూఢిల్లీలో విద్యుత్ కోతలు సైతం విధిస్తారని తెలిపారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల ఎలా పెరిగాయో.. అతిషి ఈ సందర్బంగా సోదాహరణగా వివరించారు. బీజేపీ పాలనలోని ఉత్తరప్రదేశ్‌లో రోజుకు 8 గంటలు విద్యుత్ కోతలు విధిస్తున్నారని చెప్పారు. ఈ విద్యుత్ కోతలు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కాదని.. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో విధిస్తున్నారని అతిషి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్‌ను గెలిపించకుంటే.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఏం జరుగుతుందో.. రేపు ఢిల్లీలో అదే జరుగుతుందని అతిషి పేర్కొన్నారు. ఇది బీజేపీ మోడల్ ఎలక్ట్రిసిటీ అంటూ ఆమె ఎద్దేవా చేశారు.

Also Read: Pitru Pakshalu 2024: పితృపక్ష దోష నివారణకు ఇదే సమయం.. పురుషులు అసలు చేయకూడని పనులు

Also Read:Thailand: కొండ చిలువతో వృద్దురాలు రెండు గంటల పోరాటం.. చివరకు ఏం జరిగిందంటే..?


మద్యం కుంభకోణం మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రిగా ఎక్కడా సంతకాలు చేయరాదంటూ షరతు విధించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్.. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఆప్ శాసన సభ పక్ష సమావేశంలో అతిషిని ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీ ఎల్జీ వి.కె.సక్సెనాతో కేజ్రీవాల్ సమావేశమ్యారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖతోపాటు అతిషిని సీఎంగా తమ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పత్రాలను అందజేశారు. దీంతో ఢిల్లీ సీఎంగా అతిషి శనివారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశమున్నట్లు తెలుస్తుంది.

Also Read: CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌కు వరద పోటు.. జార్ఖండ్ సరిహద్దు మూసివేత

Also Read:Justice PC Ghose : నేటి నుంచి మళ్లీ కాళేశ్వరంపై విచారణ.. హాజరుకానున్న కీలక అధికారులు

Also Read:Dhruvi Patel: మిస్ ఇండియా వరల్డ్ వైడ్‌-2024 విజేత.. ధృవీ పటేల్

For MoreNational News And Telugu News...

Updated Date - Sep 20 , 2024 | 04:49 PM