Share News

Heat Wave: మరో మూడురోజులు అధిక ఉష్ణోగ్రతలు.. ఎక్కడెక్కడ అంటే..?

ABN , Publish Date - May 02 , 2024 | 09:22 AM

ఎండల వేడితో జనం అల్లాడిపోతున్నారు. మే నెలలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించింది.

Heat Wave: మరో మూడురోజులు అధిక ఉష్ణోగ్రతలు.. ఎక్కడెక్కడ అంటే..?
Heatwave

ఎండల వేడితో జనం అల్లాడిపోతున్నారు. మే నెలలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించింది.

ఈ నెల 6వ తేదీ వరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ సూచించింది. మే 4వ తేదీ వరకు జార్ఖండ్‌లో.. మే 3వ తేదీ వరకు కేరళ, తమిళనాడులో ఎండల తీవ్రత ఉంటుంది. మే 5వ తేదీ వరకు పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్రలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.

మరోవైపు ఈశాన్య బంగ్లాదేశ్‌పై తుఫాన్ ప్రభావం ఉంది. బీహార్ నుంచి నాగాలాండ్ వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈశాన్య అసోం మీద తుఫాన్ ప్రభావం ఉంది. బంగాళాఖాతం నుంచి ఈశాన్య భారతదేశం వరకు బలంగా వీస్తున్నాయి. దీంతో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాల, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతోపాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వివరించారు.

Read Latest
National News And Telugu News

Updated Date - May 02 , 2024 | 09:29 AM