Share News

Delhi: ఢిల్లీలో రెడ్ అలర్ట్..

ABN , Publish Date - Jun 18 , 2024 | 04:16 PM

దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు సరిహద్దు రాష్ట్రాలు హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో వడగాల్పలు బలంగా వీస్తున్నాయి. వీటి తీవ్రత మరింత పెరిగి అవకాశముంది. ఈ నేపథ్యంలో సోమవారం జారీ చేసిన రెడ్ అలర్ట్‌ను బుధవారం వరకు పొడిగిస్తున్నట్లు భారత వాతావరణం విభాగం మంగళవారం వెల్లడించింది.

Delhi: ఢిల్లీలో రెడ్ అలర్ట్..

న్యూడిల్లీ, జూన్ 18: దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు సరిహద్దు రాష్ట్రాలు హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో వడగాల్పులు బలంగా వీస్తున్నాయి. వీటి తీవ్రత మరింత పెరిగి అవకాశముంది. ఈ నేపథ్యంలో సోమవారం జారీ చేసిన రెడ్ అలర్ట్‌ను బుధవారం వరకు పొడిగిస్తున్నట్లు భారత వాతావరణం విభాగం మంగళవారం వెల్లడించింది.

Also Read: ఎంపీగా ప్రియాంక గాంధీ పోటీ.. స్పందించిన రాబర్ట్ వాద్రా


అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక గౌహతిలో గత వారం రోజులుగా ఎడతేరపి లేకుండా వర్షం కురుస్తుందని తెలిపింది. అయితే సిక్కింలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు చరియలు విరిగి పడడమే కాకుండా భారీ వరదలు సైతం పోటెత్తాయని వివరించింది. ఈ నేపథ్యంలో ఒకరు మృతి చెందగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారని భారత వాతావరణ విభాగం తెలిపింది.

Also Read: నేడు సొంత నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటన


దేశంలోని వాయువ్య ప్రాంతం.. లదాఖ్ నుంచి ఝార్ఖండ్ వరకు వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. వచ్చే 24 గంటలు.. ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చే అవకాశమే లేదని తెలిపింది. మహా అయితే 2 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశముందని చెప్పింది. ఇక మధ్య, పశ్చిమ భారతావనిలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని.. అవి మూడు రోజులపాటు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం వివరించింది.

Also Read: బాలాసోర్‌లో ఉద్రిక్తత.. కర్ఫ్యూ విధింపు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 18 , 2024 | 04:18 PM