India-China: లద్దాఖ్‌లో భారత్-చైనా బలగాల ఉపసంహరణ పూర్తి
ABN , Publish Date - Oct 30 , 2024 | 09:04 PM
ఇరుదేశాలు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామాగ్రిని వెనక్కి తీసుకున్నాయని, కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్ త్వరలోనే మొదలవుతుందని, ఇందుకోసం గ్రౌండ్ కమాండర్ల చర్చలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. గురువారం దీపావళి సందర్భంగా ఇరువర్గాలు మిఠాయిలు పంచుకుంటాయని వెల్లడించారు.
న్యూఢిల్లీ: ఎల్ఏసీ వెంబడి తూర్పు లద్దాఖ్‌లోని డెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ, చైనా పీపుల్స్ లిబరేష్ ఆర్మీ (PLA) తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. రెండు ప్రాంతాల్లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ పూర్తయినట్టు ఆర్మీ అధికారులు బుధవారంనాడు తెలిపారు. ఇరుదేశాలు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామాగ్రిని వెనక్కి తీసుకున్నాయని, కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్ త్వరలోనే మొదలవుతుందని, ఇందుకోసం గ్రౌండ్ కమాండర్ల చర్చలు కొనసాగుతాయని చెప్పారు. గురువారం దీపావళి సందర్భంగా ఇరువర్గాలు మిఠాయిలు పంచుకుంటాయని వెల్లడించారు.
Ayodhya Deepotsav 2024: అయోధ్యలో కన్నులపండువగా దీపోత్సవం.. 25 లక్షల పైగా దీపాలతో గిన్నిస్ రికార్డు
భారత్-చైనా మధ్య 2020 నుంచి తలెత్తిన ఉద్రిక్తతలకు ఇటీవల తెరదించుతూ ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా లద్దాఖ్‌లోని డెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో ఇరుదేశాలు తమ బలగాలను ఉపసంహరించుకోవాలని, ఎల్ఏసీ వెంబడి 2020 నాటి యథాస్థితి కొనసాగించాలని నిర్ణయించాయి. ఆ ప్రకారం బలగాల ఉపసంహరణ పూర్తికాగానే ఇరుదేశాల సైనికులు గతంలో తామున్న పెట్రోలియంగ్ పాయింట్లకు వెళ్తారు. తిరిగి పెట్రోలింగ్‌ను పునరుద్ధరిస్తారు. ఇరుదేశాల మధ్య కుదరిన గస్తీ ఒప్పందం ప్రకారం అక్టోబర్ 29వ తేదీలోగా బలగాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భారత-చైనా బలగాల ఉపసంహరణ పూర్తయినట్టు ఇండియన్ ఆర్మీ తాజాగా ప్రకటించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో జరిగిన 'బ్రిక్స్' సదస్సుకు హాజరుకావడానికి కొద్ది ముందు భారత్-చైనా బలగాల మధ్య కీలమైన గస్తీ ఒప్పందం కుదిరింది. దీంతో గతవారం బ్రిక్స్ సదస్సులో మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింక్ కలుసుకున్నారు. ఇండియా-చైనా మధ్య ద్వౌపాక్షిక చర్చలు సైతంజరిగాయి. సరిహద్దుల్లో ప్రశాంతత అనేది తమ దేశ ప్రాధాన్యతా క్రమంలో కీలకమని మోదీ మరోసారి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Maharashtra: బరిలో భారీగా అభ్యర్థులు
Priyanka Gandhi: 30 ఏళ్లుగా హౌస్‌వైఫ్‌గా ఉన్నా, నా వాయిస్ చాలా పెద్దది
Arvind Kejriwal: దీపావళికి ఒకరోజు ముందు కేజ్రీవాల్ షాక్
For National News And Telugu News...