Share News

India-China: సరిహద్దుల వివాదంలో కీలక పురోగతి.. భారత్-చైనా మధ్య ఒప్పందం

ABN , Publish Date - Oct 21 , 2024 | 04:14 PM

భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభన, దీనిపై ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో కీలక పురోగతి కనిపించింది.

India-China: సరిహద్దుల వివాదంలో కీలక పురోగతి.. భారత్-చైనా మధ్య ఒప్పందం

న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభన, దీనిపై ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో కీలక పురోగతి కనిపించింది. దీనిపై ఇరుదేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. వాస్తవాధీన రేఖ వెంబడి పెట్రోలింగ్‌ను పునరుద్ధరించాలని ఇండియా-చైనా (India-China) నిర్ణయించినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి తెలిపారు. సోమవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత కొన్ని వారాలుగా దౌత్య, సైనిక స్థాయిలో భారతదేశం-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఫలితంగా ఎల్ఓసీ వెంబడి పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఒక అవగాహన కుదిరిందని తెలిపారు. బలగాల ఉపసంహరణ, పరిస్థితిని చక్కదిద్దేందుకు పెట్రోలింగ్ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రష్యాలో జరుగనున్న బ్రిక్స్ సదస్సుకు ప్రధానమంత్రి మోదీ వెళ్తున్న నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, చైనా ప్రధాని జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు సమావేశమవుతారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Farooq Abdullah: పాకిస్థాన్‌కు ఫరూక్ అబ్దుల్లా స్ట్రాంగ్ వార్నింగ్


తూర్పు లడఖ్ సరిహద్దుల్లో 2020లో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అప్పటి ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, చైనా వైపు నుంచి కూడా పలువురు సైనికులు మరణించారు. తాత్కాలికంగా బలగాలు వెనక్కి వెళ్లినప్పటికీ, రెండు పొరుగుదేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సరిహద్దు సమస్యల పరిష్కారానికి కొన్ని వారులుగా భారత్-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయి.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

CJI: అయోధ్య వివాద పరిష్కారం కోసం దేవుడ్ని ప్రార్థించా.. జస్టిస్ చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Oct 21 , 2024 | 04:17 PM