Global Hunger Index 2024: ప్రపంచ ఆకలి సూచీలో నేపాల్, బంగ్లాదేశ్ కంటే వెనుకబడిన భారత్.. షాకిచ్చిన చైనా
ABN , Publish Date - Oct 13 , 2024 | 11:51 AM
ప్రపంచ ఆకలి సూచిక 2024లో భారతదేశం ర్యాంక్ మెరుగు పడింది. కానీ పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్‌ల కంటే మాత్రం వెనుకబడి ఉంది. అయితే ఉత్తమ, చివరి స్థానంలో ఉన్న దేశాలు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (Global Hunger Index) 2024లో 127 దేశాల జాబితాలో ఈసారి భారత్ 105వ స్థానానికి చేరుకుంది. గతేడాది 125 దేశాల్లో భారత్ 111వ స్థానంలో ఉండగా, అంతకు ముందు 107వ స్థానంలో ఉంది. ఈసారి ర్యాంకింగ్‌లో పరిస్థితి కొంత మెరుగుదల ఉంది. కానీ 27.3 స్కోర్‌తో తీవ్రమైన ఆకలి సమస్యలతో బాధపడుతున్న 42 దేశాలలో భారతదేశం కూడా ఉంది. ఈ జాబితాలో చైనా, యూఏఈ, కువైట్‌తో సహా 22 దేశాలు మొదటి స్థానంలో నిలిచాయి. ఏ దేశంలో ఆకలి పరిస్థితి ఎలా ఉంటుందో GHI చెబుతుంది. ఒక దేశం స్కోర్ తక్కువ ఉంటే, అక్కడి ప్రజలు తక్కువ ఆకలితో ఉన్నారని అర్థం.
ఈ దేశాల్లో మరింత తీవ్రం
ఈ నివేదికను ఐరిష్ సంస్థ కన్సర్న్ వరల్డ్‌వైడ్, వరల్డ్ హంగర్ హెల్ప్ సంయుక్తంగా ప్రచురించాయి. 19వ GHI నివేదిక ప్రకారం భారతదేశం దాని పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్‌ల కంటే వెనుకబడి ఉండటం విశేషం. అదే సమయంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉంది. శ్రీలంక 56, నేపాల్ 68, బంగ్లాదేశ్‌లు 84వ ర్యాంక్‌తో భారత్ కంటే చాలా ముందున్నాయి.
టాప్ 5
ఈ దేశాలన్నీ మెరుగైన GHI స్కోర్లతో మిడిల్ కేటగిరీలో ఉన్నాయి. అదే సమయంలో 109వ స్థానంలో ఉన్న పాకిస్థాన్, 116వ స్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌లు తీవ్రమైన కేటగిరీలో చేర్చబడ్డాయి. బెలారస్, బోస్నియా, చిలీ, చైనా, కోస్టారికా దేశాలు అగ్రస్థానం దక్కించుకున్నాయి. సోమాలియా, యెమెన్, చాద్, మడగాస్కర్, కాంగో దేశాలు లాస్ట్ 5లో ఉన్నాయి.
యుద్ధం కారణంగా
GHI ప్రకారం కొన్ని ఆఫ్రికన్ దేశాలు రిస్క్ కేటగిరీలో తీవ్ర స్థాయికి చేరాయి. అసాధారణ ఆహార సంక్షోభానికి గాజా, సూడాన్‌లలో జరిగిన యుద్ధాలే కారణమని నివేదిక పేర్కొంది. డొమినికన్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, హైతీ, మాలి, సిరియాతో సహా ఇతర ప్రదేశాలలో కూడా యుద్ధం, పౌర సంఘర్షణ ఆహార సంక్షోభాలకు కారణమవుతుందని నివేదిక వెల్లడించింది. ఆకలి తీవ్రతను ప్రతిబింబించే 100 పాయింట్ స్కేల్లో ప్రతి దేశానికి GHI స్కోర్ లెక్కించబడుతుంది. ఇక్కడ 0 ఉత్తమ స్కోర్ (ఆకలి లేదని అర్థం). 100 చెత్త స్కోర్ ఆకలి ఎక్కువగా ఉందని అర్థం.
బిలియన్ల మంది
తగినంత ఆహారం పొందే హక్కు ప్రాముఖ్యతపై అంతర్జాతీయ సమాజం పదేపదే నొక్కిచెబుతున్నప్పటికీ ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఆహార హక్కు నిర్ద్వంద్వంగా మారిపోయిందని నివేదిక ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.8 బిలియన్ల మంది ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారని రిపోర్ట్ తెలిపింది. తగినంత మొత్తంలో ఆహారం అందుబాటులో లేకపోవడం వల్ల ప్రతిరోజూ 733 మిలియన్ల మంది ప్రజలు ఆకలిని ఎదుర్కొంటున్నారని నివేదిక స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
Online Shopping Tips: పండుగల సీజన్లో ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Read More National News and Latest Telugu News