Share News

Amit Shah: యాంటీ డ్రోన్ విభాగంతో శత్రు దుర్భేద్యంగా సరిహద్దులు

ABN , Publish Date - Dec 08 , 2024 | 06:23 PM

రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో ఆదివారంనాడు జరిగిన బీఎస్ఎఫ్ 60వ ఫౌండేషన్ పెరేడ్‌లో హోం మంత్రి పాల్గొన్నారు. డ్రోన్ల వల్ల తలెత్తుతున్న ముప్పు, ముఖ్యంగా భారత-పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి డ్లోన్ల అనుమానాస్పద కదిలకలను ప్రధానంగా ప్రస్తావించారు.

Amit Shah: యాంటీ డ్రోన్ విభాగంతో శత్రు దుర్భేద్యంగా సరిహద్దులు

జోథ్‌పూర్: మానవరహిత వైమానిక విమానాల (UAVs) వల్ల పెరుగుతున్న ముప్పును సమర్ధవంతంగా తిప్పికొట్టి, సరిహద్దుల్లో భద్రతను పెంచేందుకు సమగ్ర డ్రోన్ నిరోధక విభాగాన్ని (Anti Drone Unit) త్వరలోనే ఏర్పాటు చేయనున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) ప్రకటించారు. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో ఆదివారంనాడు జరిగిన బీఎస్ఎఫ్ 60వ ఫౌండేషన్ పెరేడ్‌లో హోం మంత్రి పాల్గొన్నారు. డ్రోన్ల వల్ల తలెత్తుతున్న ముప్పు, ముఖ్యంగా భారత-పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి డ్లోన్ల అనుమానాస్పద కదిలకలను ప్రధానంగా ఆయన ప్రస్తావిస్తూ, డ్రోన్ల అనుమానాస్పద కదలికలు భద్రతా దళాలకు సవాళ్లు విసురుతున్నందున దీనిని సమర్ధవంగా ప్రభుత్వం ఎదుర్కొంటుందని చెప్పారు.

Maharashtra: 'మహా' అసెంబ్లీ స్పీకర్‌గా రాహుల్ నార్వేకర్ ఏకగ్రీవం


లేజర్‌తో కూడిన యాంట్రీ డ్రోన్ గన్ మౌంటెడ్ మెకానిజం ప్రాథమికంగా మంచి ఫలితాలను ఇచ్చినట్టు అమిత్‌షా తెలిపారు. ఈ మెకానిజం ద్వారా పంజాబ్ సరిహద్దుల్లో ప్రత్యర్థి డ్రోన్ల కదలికలను గుర్తించి, కూల్చివేసిన కేసులు 3 శాతం నుంచి 55 శాతానికి పెరిగాయని చెప్పారు. 2023లో సుమారు 110 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకోగా, ఈ ఏడాదిలోనే 260కి పైగా డ్రోన్లను అడ్డుకున్నామని, వీటిల్లో అత్యధికంగా డ్రోన్లు అక్రమంగా ఆయుధాలు, మాదకద్రవ్యాల స్మగ్లి్ంగ్‌కు ఉద్దేశించినవేనని తెలిపారు.


ప్రత్యర్థి డ్రోన్ల ముప్పు రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలున్న దృష్ట్యా డీఆర్‌డీఓ, రక్షణ, పరిశోధన సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్టు అమిత్‌షా తెలిపారు. త్వరలో సమగ్ర 'యాంటీ డ్రోన్ యూనిట్'ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇండియా-బంగ్లాదేశ్, ఇండియా-పాకస్థాన్ సరిహద్దులను శత్రుదుర్భేద్యం చేసేందుకు సమగ్ర సమీకృత నిర్వహణ వ్యవస్థ (సీబీబీఎంఎస్) పురోగతిలో ఉందన్నారు. ఉత్తరాది సరిహద్దు గ్రామాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న 'వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రాం' (వీవీపీ)ను దేశంలోని అన్ని సరిహద్దు పల్లెలకు విస్తరిస్తామని తెలిపారు. కొత్తగా శిక్షణ తీసుకున్న 13,226 మందిని బీఎస్‌ఎఫ్‌లోకి తీసుకున్నామని, అదనంగా మరో 4000 మందిని రిక్రూట్ చేసేందుకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

Viral News: పుష్ప సినిమా స్టైల్లో బంగాళాదుంపల స్మగ్లింగ్.. అడ్డుకున్న పోలీసులు

Viral: కదులుతున్న కారు టాపుపై కూర్చుని పోలిసు అధికారి కుమారుడి పోజులు!

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 08 , 2024 | 06:24 PM