Share News

Drugs Seized: రూ.600 కోట్ల డ్రగ్స్ స్వాధీనం, పాక్ భారీ కుట్ర భగ్నం

ABN , Publish Date - Apr 28 , 2024 | 09:01 PM

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కీలక ఆపరేషన్‌ నిర్వహించి దేశంలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్థాన్ భారీ కుట్రను ఛేదించింది. గుజరాత్ తీరంలో 86 కిలోల డ్రగ్స్‌ను గుజరాత్ తీరప్రాంతంలో అధికారులు ఆదివారంనాడు స్వాధీనం చేసుకున్నారు.

 Drugs Seized: రూ.600 కోట్ల డ్రగ్స్ స్వాధీనం, పాక్ భారీ కుట్ర భగ్నం

న్యూఢిల్లీ: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) కీలక ఆపరేషన్‌ నిర్వహించి దేశంలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్థాన్ భారీ కుట్రను ఛేదించింది. గుజరాత్ తీరంలో 86 కిలోల డ్రగ్స్‌ను గుజరాత్ తీరప్రాంతంలో అధికారులు ఆదివారంనాడు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు పాల్పడిన 14 మంది పాకిస్థానీయులను అధికారులు అరెస్టు చేశారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.600 కోట్లు వరకూ ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Mahadev Betting App Case: బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్టు, పోలీస్ రిమాండ్


గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఇండియన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఓవర్‌నైట్ ఆపరేషన్‌ జరిపినట్టు తెలిపింది. అనుమానాస్పద బోట్‌ను కనిపెట్టేందుకు ఐసీజీ షిప్ రాజస్థాన్‌ను ఉపయోగించినట్టు తెలిపింది. కాగా, అరెస్టు చేసిన 14 మంది పాకిస్థానీయులను తదుపరి విచారణ కోసం పోర్‌బందర్ తీసుకువచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Updated Date - Apr 28 , 2024 | 09:01 PM