Indian Navy: 23 మంది పాకిస్థానీలను రక్షించిన భారత్.. ఏమైందంటే
ABN , Publish Date - Mar 30 , 2024 | 06:41 AM
భారత నౌకాదళం(Indian Navy) మరోసారి తన బలాన్ని ప్రదర్శించింది. నేవీ సైనికులు మరోసారి ధైర్యసాహసాలు ప్రదర్శించి సముద్రపు దొంగల నుంచి పలువురిని కాపాడారు. ఆ క్రమంలో భారత నౌకాదళం రక్షించిన వారిలో 23 మంది పాకిస్థానీలు(Pakistani nationals) ఉన్నారు. అయితే శుక్రవారం యెమెన్ సమీపంలోని సోకోత్రా గుండా వెళుతున్న ఇరాన్ నౌకను తొమ్మిది మంది సాయుధ సముద్రపు దొంగలు హైజాక్ చేశారు.

ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే, భారత నావికాదళం వెంటనే స్పందించింది. హైజాక్ చేయబడిన ఓడను వెతికేందుకు, దానిని విడిపించడానికి గైడెడ్ క్షిపణులతో కూడిన రెండు యుద్ధనౌకలు ANS సుమేధ, INS త్రిశూల్‌లను పంపింది. ఆ క్రమంలో కొన్ని గంటల్లోనే హైజాక్ చేయబడిన ఓడ సమీపంలోకి చేరుకున్న తర్వాత నేవీ తన చర్యను ప్రారంభించింది.
ఆ క్రమంలో ఇరాన్ ఫిషింగ్ ఓడ( Iranian Fishing Vessel) అల్ కాన్బర్ 789లో ఉన్న 23 మంది పాకిస్థానీలను భారత నావికాదళం(Indian Navy) రక్షించింది. హైజాక్ చేసిన విమానాన్ని అడ్డుకుని హైజాకర్లకు(Somali pirates) వార్నింగ్ ఇచ్చి మార్కోస్ కమాండోలను దింపారు. చిన్నపాటి ప్రతిఘటన తర్వాత, హైజాక్ చేయబడిన తొమ్మిది మంది బందిపోట్లు కమాండోల ముందు లొంగిపోయారు. వారిని అదుపులోకి తీసుకుని ఇప్పుడు విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు(officers) వెల్లడించారు.
మరోవైపు హైజాక్‌కు గురైన ఇరాన్ నౌక(Iranian Fishing Vessel)ను, సిబ్బందిని రక్షించేందుకు భారత నావికాదళం చేపట్టిన ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని భారత నౌకాదళం తన ప్రకటనలో తెలిపింది. ఆ ప్రాంతంలో సముద్ర భద్రత, జాతీయతలతో సంబంధం లేకుండా నావికుల భద్రతకు భారత నౌకాదళం కట్టుబడి ఉందని భారత స్పష్టం చేసింది. అంతేకాదు గత నెలల్లో కూడా అరేబియా, ఎర్ర సముద్రంలో అనేక దేశాల నౌకలను రక్షించడానికి భారత నావికాదళం చర్యలు చేపట్టి, విజయవంతంగా రక్షించడం విశేషం.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: అమెరికా జట్టులో తెలుగమ్మాయి శాన్వి