Share News

Delhi: ఇక ఎక్కడికైనా నాన్ స్టాప్ సర్వీస్.. A350 విమానాలకు ఆర్డర్ ఇచ్చిన ఇండిగో

ABN , Publish Date - Apr 25 , 2024 | 07:04 PM

భారత విమానాయాన మార్కెట్‌లో 60 శాతం వాటా కలిగి ఉన్న ఎయిర్ ఇండియా(Air India) 2030నాటికి దాని సామర్థ్యాన్ని రెట్టింపు చేసి.. అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వైట్‌బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను తొలిసారి కొనుగోలు చేస్తోంది. తాజాగా ఇండిగో A350-900 జెట్‌లను ఆర్డర్ చేసింది. 30 విమానాల కొనుగోలుతో పాటు, 70 అదనపు A350 విమానాల కొనుగోలు హక్కుల కోసం ఇండిగో సైన్ అప్ చేసింది.

Delhi: ఇక ఎక్కడికైనా నాన్ స్టాప్ సర్వీస్.. A350 విమానాలకు ఆర్డర్ ఇచ్చిన ఇండిగో

ఢిల్లీ: భారత విమానాయాన మార్కెట్‌లో 60 శాతం వాటా కలిగి ఉన్న ఎయిర్ ఇండియా(Air India) 2030నాటికి దాని సామర్థ్యాన్ని రెట్టింపు చేసి.. అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వైట్‌బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను తొలిసారి కొనుగోలు చేస్తోంది. తాజాగా ఇండిగో A350-900 జెట్‌లను ఆర్డర్ చేసింది.

30 విమానాల కొనుగోలుతో పాటు, 70 అదనపు A350 విమానాల కొనుగోలు హక్కుల కోసం ఇండిగో సైన్ అప్ చేసింది. ఈ విమానాలు ఎయిర్ ఇండియా, విస్తారాతో పోటీ పడుతూ.. భారత్, అమెరికా మధ్య నాన్‌స్టాప్ అల్ట్రా లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు అందించనున్నాయి. 2023లో ఇండిగో ఎయిర్‌బస్‌తో 500 విమానాల ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ ఒప్పందం విమానయాన చరిత్రలో రికార్డ్ సృష్టించింది.


ప్రస్తుతం ఆర్డర్ల సంఖ్యను వెయ్యికి పెంచింది. "ఇండిగో.. 30 ఫర్మ్ A350-900 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఈ చర్య ఇండిగో తన సామ్రాజ్యాన్ని, నెట్‌వర్క్‌ను విస్తరించడానికి వీలు కల్పిస్తుంది. ప్రయాణికులను మెట్రో నగరాల నుంచి ప్రపంచానికి కనెక్ట్ చేయగలదు.

ఆర్డర్ చేసిన విమానాలు ట్రెంట్ XWB ఇంజిన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి" అని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. విమానాల కన్ఫిగరేషన్ తరువాత నిర్ణయిస్తామని.. 2027నాటికి ఆర్డర్ చేసిన విమానాలు అందుబాటులోకి వస్తాయని ఎయిర్‌లైన్ తెలిపింది.


Mumbai: పాపం పసికూనలు.. ఆడుకోవడానికి కారెక్కి.. కానరాని లోకాలకు

ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ మాట్లాడుతూ.. "తాజా నిర్ణయం ఇండిగో చరిత్రలో గొప్ప అధ్యయనాన్ని లిఖిస్తుంది. అదే సమయంలో భారతీయ విమానయాన భవిష్యత్తును మరింత అందంగా మారుస్తుంది. దేశ ప్రజలు ఇష్టపడే ఎయిర్‌లైన్‌గా, మా కస్టమర్‌లతో కనెక్ట్ అయినందుకు గర్విస్తున్నాం. తాజా నిర్ణయం దేశ వృద్ధికి దోహదపడుతూ.. ఇండిగోపై నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది" అని అన్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 07:05 PM